‘దొరసాని’ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో కె.వి.మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ జూలై 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 80వ దశకంలో తెలంగాణలో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. యాష్ రంగినేని, మధుర శ్రీధర్ కలిసి సంయుక్తంగా […]

'దొరసాని' ట్రైలర్ డేట్ ఫిక్స్..!

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో కె.వి.మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ జూలై 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

80వ దశకంలో తెలంగాణలో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. యాష్ రంగినేని, మధుర శ్రీధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 12న విడుదల కానుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu