Karthika Deepam Climax: క్లైమాక్స్ అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవిదేశాల్లో ఎక్కడ తెలుగువారున్నారో అక్కడ కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్స్ ఉన్నారు. సాయంత్రం ఏడున్నర దాటితే చాలు సెలబ్రెటీల ఇళ్లలో సైతం కార్తీకదీపం..

  • Updated On - 6:02 pm, Mon, 25 January 21
Karthika Deepam Climax: క్లైమాక్స్  అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు

Karthika Deepam Climax: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవిదేశాల్లో ఎక్కడ తెలుగువారున్నారో అక్కడ కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్స్ ఉన్నారు. సాయంత్రం ఏడున్నర దాటితే చాలు సెలబ్రెటీల ఇళ్లలో సైతం కార్తీకదీపం సీరియల్ కోసం బుల్లితెర ముందుకు చేరిపోతారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడెప్పుడు కలుస్తారా.. ఆ మోనిత అసలు రంగు ఎప్పుడు బయటపడుతుందా అంటూ ఎదురు చూస్తుంటారు.

అయితే కార్తీక దీపం క్లైమాక్స్ గురించి ఇటీవల నిరుపమ్ పరిటాల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కార్తీక దీపం క్లైమాక్స్‌ సంగతేంటి? దీపకు దగ్గర అవుతారా? లేక మోనితని పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నలకు డాక్టర్ బాబు సమాధానం చెప్పారు. తాను ఈ సీరియల్ లో నటించడానికి ఒప్పుకున్న సమయంలో మంచి క్యారెక్టర్ అనుకున్నా.. గతంలో చేసిన దానికంటే భిన్నం అని అనుకున్న అయితే ఆ క్యారెక్టర్ కి ఈరోజు ఇంత మంచి పేరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కార్తీకదీపం ఈ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందని అస్సలు ఊహించలేదు.. మా అందిరికీ సర్‌ఫ్రైజింగే అన్నారు.

రోజు రోజుకీ ఈ సీరియల్ మీద బుల్లితెర ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో వారికి నచ్చినట్లుగానే క్లైమాక్స్ ఉండాలి. అటు ఇటు తేడా వస్తే… అభిమానులు బస్సులు, లారీలు వేసుకుని వచ్చేటట్లున్నారు అంటూ సరదాగా కామెంట్ చేశారు నిరుపమ్. చివరికి ఎవరికీ న్యాయం చెయ్యాలో వారికే చేస్తామని అన్నారు.. సో వంటలక్క అభిమానులు కోరుకున్నట్లు చివరికి కార్తీక్, దీపలు ఒక్కటి కావడం జరుగుతుందని తెలుస్తోంది.

Also Read: ఆయనకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27మంది భార్యలు, 150 మంది పిల్లలు