టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రన్ టైమ్ మూవీ ఏదో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 45నిమిషాలకు ఫిక్స్ చేయగా.. ‘యు/ ఎ’ సర్టిఫికేట్‌తో సెన్సార్‌ కూడా పూర్తి అయ్యింది. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది ‘సైరా’ టీమ్. ఇక హిందీ ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా ఇవాళ ముంబైకు వెళ్లనున్నారు. అక్కడ వారు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే ఒక చిత్రానికి నటీనటుల నటన, […]

టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రన్ టైమ్ మూవీ ఏదో తెలుసా..!
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2019 | 8:15 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 45నిమిషాలకు ఫిక్స్ చేయగా.. ‘యు/ ఎ’ సర్టిఫికేట్‌తో సెన్సార్‌ కూడా పూర్తి అయ్యింది. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది ‘సైరా’ టీమ్. ఇక హిందీ ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా ఇవాళ ముంబైకు వెళ్లనున్నారు. అక్కడ వారు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొననున్నారు.

ఇదిలా ఉంటే ఒక చిత్రానికి నటీనటుల నటన, దర్శకత్వం, సాంకేతిక వర్గం పనితీరు ఎంత అవసరమో.. రన్‌టైమ్ కూడా అంతే ముఖ్యం. ఓ సినిమాను చూడాలనుకునేందుకు చాలా మంది రన్‌ టైమ్‌ను కౌంట్ చేసుకుంటారు. దాన్ని బట్టే ఆ చిత్రానికి వెళ్లాలా..? వద్దా..? అని కూడా ఆలోచిస్తుంటారు. అయితే అన్ని సినిమాలకు రన్‌ టైమ్ ఒకేలా ఉండకపోవచ్చు. కమర్షియల్ కథా చిత్రాలు ఒక రన్ టైమ్‌, థ్రిల్లర్ చిత్రాలు మరో రన్ టైమ్‌ ఉంటుంది. ఇక వారు ఎంచుకున్న కథను బట్టి రన్ టైమ్‌ను నిర్ధారించుకుంటుంటారు దర్శకులు.

కాగా ఒకప్పుడు టాలీవుడ్‌లో రన్ టైమ్ మూడు గంటలకు పైగా ఉండేది. కథలో దమ్ము ఉంది అనుకున్నప్పుడు రన్ టైమ్‌ను పెంచేవారు అప్పటి దర్శకులు. ఇక సినిమా బావుంది అన్న టాక్ వచ్చినప్పుడు తమ సమయాన్ని కూడా పట్టించుకోకుండా అప్పటి ప్రేక్షకులు చూసేవారు. అయితే ఆ తరువాత పలు కారణాల వలన అది క్రమంగా తగ్గుతూ 2గంటల 30 నిమిషాలకు చేరింది. కానీ 2017లో ‘అర్జున్ రెడ్డి’ వచ్చి విజయం సాధించిన తరువాత రన్‌ టైమ్‌పై ఇప్పటి దర్శకులకు కొత్త ధైర్యం వచ్చింది. తాము తెరకెక్కించే సినిమా బావుంటే ప్రేక్షకులు రన్ టైమ్‌ను పట్టించుకోరన్న నమ్మకం వారిలో కలిగింది. దీంతో కథను అనుగుణంగా రన్ టైమ్ మళ్లీ పెంచుకుంటున్నారు దర్శకులు. కాగా ఇప్పటివరకు టాలీవుడ్‌లో అత్యధిక రన్ టైమ్ ఉన్న చిత్రమేదో తెలుసా..? ‘దాన వీర శూర కర్ణ’. 1977లో వచ్చిన ఈ చిత్రం 3 గంటల 56నిమిషాలు పాటు ఉంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ స్వీయంగా తెరకెక్కించి, నిర్మించి నటించారు. ఇక ఆ చిత్రం కాకుండా తెలుగులో హయ్యెస్ట్ రన్ టైమ్ సినిమాలు కొన్ని మీ కోసం.

పాండవ వనవాసం– 3 గంటల18 నిమిషాలు బాహుబలి 2– 3గంటల 17నిమిషాలు పాతాల భైరవి– 3గంటల 16 నిమిషాలు అర్జున్ రెడ్డి– 3గంటల 6నిమిషాలు మాయా బజార్– 3గంటల 4 నిమిషాలు మిస్సమ్మ– 3గంటల 1నిమిషం మహర్షి– 3గంటలు నువ్వు నాకు నచ్చావు– 3 గంటలు జానీ– 2గంటల 58నిమిషాలు రంగస్థలం– 2గంటల 54నిమిషాలు డియర్ కామ్రేడ్– 2 గంటల 50 నిమిషాలు.

ఇందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం విశేషం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu