Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంతో భేటీకి ముందు ఆర్జీవీ మరో సంచలన ట్వీట్‌.. వాటి ధరలను నిర్ణయించలేదంటూ..

ఏపీ సినిమా టికెట్ల ధరల  వ్యవహారంపై  అటు  టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య  గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. 

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంతో భేటీకి ముందు ఆర్జీవీ మరో సంచలన ట్వీట్‌.. వాటి ధరలను నిర్ణయించలేదంటూ..
Ram Gopal Varma
Follow us

|

Updated on: Jan 08, 2022 | 2:36 PM

ఏపీ సినిమా టికెట్ల ధరల  వ్యవహారంపై  అటు  టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య  గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే.   కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేయడం..  వాటికి ఏపీ మంత్రులు  రివర్స్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది.  ఈ క్రమంలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలుస్తున్నారు. న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని వరుస ట్వీట్లు కూడా పెట్టారు. నాగబాబు కూడా ఆర్జీవీకి సపోర్టుగా నిలిచారు. ఇక వర్మ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. ఇక సినిమా పరిశ్రమలోని సమస్యలపై చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. కాగా ఎట్టకేలకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో వీరద్దరి భేటీ జరగనుంది. అయితే ఈ భేటీకి ముందే ఆర్జీవీ మరో సంచలన ట్వీట్ చేశారు.

‘చలనచిత్రాలు, థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు మొదలైనవి కూడా వినోద సంస్థల కిందకు వస్తాయి. వీటి టిక్కెట్ ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు’ అంటూ వర్మ మరో ట్వీట్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ ధరల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్న ఆయన ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read:

Newzeland Cricket:11 ఫోర్లు,11 సిక్స్‌లు.. బౌలర్లను ఊచకోత కోసిన ఆటగాడు ఎవరంటే..

Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు..

Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!