‘మహానటి’ మేకర్స్‌తో ‘ఓ బేబి’ దర్శకురాలు నెక్ట్స్ మూవీ

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది సమంతతో తెరకెక్కించిన ‘ఓ బేబి’తో నందిని రెడ్డి పేరు మరోసారి వినిపించింది. కొరియన్ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా నందినిరెడ్డి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించించారని.. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తనదైన మార్కును చూపించారని.. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఒక మూవీకి మరో మూవీకి బాగా గ్యాప్ తీసుకుంటూ […]

  • Publish Date - 1:37 pm, Tue, 8 October 19 Edited By:
'మహానటి' మేకర్స్‌తో 'ఓ బేబి' దర్శకురాలు నెక్ట్స్ మూవీ

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది సమంతతో తెరకెక్కించిన ‘ఓ బేబి’తో నందిని రెడ్డి పేరు మరోసారి వినిపించింది. కొరియన్ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా నందినిరెడ్డి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించించారని.. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తనదైన మార్కును చూపించారని.. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఒక మూవీకి మరో మూవీకి బాగా గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ దర్శకురాలు.. ఇప్పుడు మాత్రం జోరును పెంచేసింది. దసరా సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.

నందినీ తదుపరి మూవీని మహానటి నిర్మాతలైన అశ్వనీదత్, ప్రియాంక దత్‌లతో నిర్మించనున్నారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ మాటలు అందిస్తుండగా.. రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా ఖరారు అయ్యారు. అయితే ఇందులో నటించే నటీనటుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.