Gautham Menon vs Dhanush: గౌతమ్ మీనన్ వర్సెస్ ధనుష్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
గౌతమ్ మీనన్.. క్లాసిక్ లవ్ స్టోరీస్‌కి, స్టైలిష్ మేకింగ్‌కి కేరాఫ్ అడ్రెస్.. సినిమా మేకింగ్‌లో తనకంటూ ఓ స్పెషల్ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నారు మీనన్. ఈయన హిట్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ..ఇంకా ఆ పాత సినిమాలను రిపీట్ మోడ్‌లో చూస్తుంటారు అభిమానులు. కాకపోతే..ఈ మధ్య కాలంలో పూర్తిగా యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టారు.

గౌతమ్ మీనన్.. క్లాసిక్ లవ్ స్టోరీస్‌కి, స్టైలిష్ మేకింగ్‌కి కేరాఫ్ అడ్రెస్.. సినిమా మేకింగ్‌లో తనకంటూ ఓ స్పెషల్ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నారు మీనన్. ఈయన హిట్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ..ఇంకా ఆ పాత సినిమాలను రిపీట్ మోడ్‌లో చూస్తుంటారు అభిమానులు. కాకపోతే..ఈ మధ్య కాలంలో పూర్తిగా యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ..ఓ ఫిల్మ్ మేకర్‌గా మాత్రం తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే..ఈ క్లాసిక్ డైరెక్టర్ ఈ మధ్యే ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు గౌతమ్ మీనన్. ఆ సమయంలో తన ఫిల్మోగ్రఫీ గురించి డిస్కషన్ వచ్చింది. ధనుష్‌తో తీసిన ఎనై నొకి పాయుమ్ తొట (Enai Noki Paayum Thota) సినిమా రిజల్ట్ గురించి ఇంటర్వ్యూర్ ఓ క్వశ్చన్ అడిగాడు. ఆ సినిమా రిజల్ట్ ఎందుకలా వచ్చిందో అనాలసిస్ చేశారా అని అడగ్గా అందుకు గౌతమ్ మీనన్ “మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమాని నేను డైరెక్ట్ చేయలేదు. ఇంకెవరో చేశారు” అని సెటైరికల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది వివాదాస్పదమైంది. ధనుష్, మేఘా ఆకాశ్ ఈ సినిమాలో నటించారు. తెలుగులోనూ తూటా పేరుతో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
ధనుష్ ఈ సినిమాలో వేలు పెట్టాడని, అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిందనే అర్థం వచ్చేలా గౌతమ్ మీనన్ వ్యాఖ్యలున్నాయని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ముఖ్యంగా ధనుష్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అని..గౌతమ్ మీనన్ కాస్త లేట్‌గా అయినా రియాక్ట్ అయ్యాడు. అనవసరంగా తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్ విషయంలో తనకు అసంతృప్తిగా అనిపించిందని, షూటింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందుల వల్ల ఫోకస్ చేయలేకపోయానని చెప్పాడు గౌతమ్. చాలా క్యాజువల్‌గా చేసిన కామెంట్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నాడు.
ధనుష్ ఫ్యాన్స్ మాత్రం కౌంటర్‌లు వేయడం ఆపడం లేదు. కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంపైన కాకుండా..కమ్‌బ్యాక్ ఇవ్వడంపై ఫోకస్ చేయాలని క్లాస్ తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో నయనతార వర్సెస్ ధనుష్ ఇష్యూ గట్టిగానే నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరి వాదనలు వాళ్లకున్నాయి. ఇప్పుడు కొత్తగా గౌతమ్ మీనన్ వర్సెస్ ధనుష్ ఇష్యూ కూడా మొదలవడం వల్ల తమిళ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందన్న డిబేట్ మొదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి