ఏదీ శాశ్వతం కాదు… టీవీ9 “ఫ్రాంక్ టాక్”‌@4PMలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు

ప్రముఖ తెలుగు సినీ నటుడు, రాజకీయ వేత్త, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి తెలిసిందే. ముక్కుసూటి తత్వం ఆయన నైజం. ఆయన పేల్చే డైలాగ్‌లు బుల్లెట్లలా దూసుకెళ్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన కేవలం చిత్రసీమకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంటారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయాన్ని మోహన్ బాబు ఎలా […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:24 pm, Sat, 9 May 20
ఏదీ శాశ్వతం కాదు... టీవీ9 "ఫ్రాంక్ టాక్"‌@4PMలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు

ప్రముఖ తెలుగు సినీ నటుడు, రాజకీయ వేత్త, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి తెలిసిందే. ముక్కుసూటి తత్వం ఆయన నైజం. ఆయన పేల్చే డైలాగ్‌లు బుల్లెట్లలా దూసుకెళ్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన కేవలం చిత్రసీమకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంటారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయాన్ని మోహన్ బాబు ఎలా గడుపుతున్నారు..?తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ప్రస్తుతం టాలీవుడ్ పెద్దన్న ఎవరు..? కరోనా మహమ్మారి, దేశంలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల తీరుపై తన అభిప్రాయాలను టీవీ9 వేదికగా ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు జరిగే ఫ్రాంక్ టాక్ కార్యక్రమంలో పంచుకోనున్నారు. టీవీ9 తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 4.00 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక చూడండి.