విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే నాతో తప్పుగా ప్రవర్తించాడు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన బాలీవుడ్‌ బుల్లితెర నటి..

'మీటూ' ఉద్యమం సినిమా పరిశ్రమలో ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని స్ఫూర్తితోనే చాలామంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలు, లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టారు

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే నాతో తప్పుగా ప్రవర్తించాడు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన బాలీవుడ్‌ బుల్లితెర నటి..

‘మీటూ’ ఉద్యమం సినిమా పరిశ్రమలో ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని స్ఫూర్తితోనే చాలామంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలు, లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ బుల్లితెర నటి దేవొలీనా భట్టాచార్య చిన్నతనంలో తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని పంచుకుంది. ‘సాథ్‌ నిభానా సాతియా’ సీరియల్‌, బిగ్‌బాస్‌ వంటి రియాలిటీ షో లతో హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరే తనతో తప్పుగా ప్రవర్తించాడంటూ భావోద్వేగానికి గురైంది.
‘చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్తే ఓ మ్యాథ్స్‌ టీచర్‌ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దురదృష్టకరమైన విషయమేమిటంటే సమాజంలో అతనికి చాలా మంచి టీచర్‌ అని గుర్తింపు ఉండేది. నా స్నేహితులతో పాటు చాలా మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్‌కు వెళ్లేవారు. అయితే నేను ట్యూషన్‌కు వెళ్లడం ప్రారంభించి వారం రోజులు గడిచిన తర్వాత నా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ట్యూషన్‌కు వెళ్లడం మానేశారు. ఏం జరిగింది? ఎందుకు ట్యూషన్‌కు రావట్లేదు? అని వారిని అడిగినా నోరు మెదపలేదు’.

పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాం.. కానీ..
‘ఆ తర్వాతి రోజు నేనూ ఎప్పటిలాగానే ట్యాషన్‌కు వెళ్లాను. అయితే అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఇంటికి వెళ్లి అమ్మకి ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత ట్యూషన్‌ టీచర్‌ ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిన దారుణం గురించి వివరించాం. ఆ ట్యూషన్‌ టీచర్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్లు అలా చేయలేదు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ పిల్లల ప్రవర్తన, నడవడికలో ఏవైనా మార్పులు వస్తే వెంటనే అప్రమత్తమవ్వండి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి’ అని వేడుకుంది.

Also Read:

S. J. Suryah: ఆ ఇద్దరిలో తేడా అదే.. పవన్- మహేష్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎస్.జె. సూర్య

Rajinikanth: ఓటీటీలోకి అడుగుపెట్టిన పెద్దన్న.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Click on your DTH Provider to Add TV9 Telugu