‘ఆస్క్ మి’లో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్న బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి.. అయితే ఓ అభిమాని ప్రశ్నకు..

డిఫ్రెంట్ రోల్ చేస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె. తన నటనతో ఎంతోమంది

  • uppula Raju
  • Publish Date - 10:43 am, Fri, 22 January 21
'ఆస్క్ మి'లో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్న బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి.. అయితే ఓ అభిమాని ప్రశ్నకు..

డిఫ్రెంట్ రోల్ చేస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె. తన నటనతో ఎంతోమంది అభిమానులను అలరిస్తూ బాలీవుడ్‌లో అగ్రనటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా వరల్డ్ వైడ్‌గా ఫాలోయింగ్ సంపాదించింది. హీరో రణవీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లాడిన దీపిక తర్వాత కెరీర్ పరంగా బిజీ బిజీగా మారిపోయింది.

అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే ఈ సొట్టబుగ్గల సుందరి వారికోసం ‘నన్ను అడగండి(Ask Me)’ అనే సెషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇస్తోంది. మేల్కొన్న తర్వాత మీరు చేసే మొదటి పని ఏది అని ఓ ఫ్యాన్ అడిగ్గా.. తాను మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని నా అలారంను ఆపేయడమని తెలిపింది. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం రోజూ వ్యాయమం చేస్తానని చెప్పింది. అలాగే ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలను షేర్ చేసింది. అభిమానులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం దీపికా హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఇంటర్న్’ రీమేక్ చేయబోతున్నది. ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ద్రౌపది రోల్ చేస్తోంది.

మరో వివాదంలో నెట్‌ఫ్లిక్స్..’ఏ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్‌పై ఆక్షేపణలు.. ఆలయంలో ముద్దులపై ఆగ్రహం