‘పుష్ప’.. ఆయన స్థానంలో మరొకరిని తీసుకోవాలనుకుంటోన్న సుకుమార్..!

'పుష్ప'.. ఆయన స్థానంలో మరొకరిని తీసుకోవాలనుకుంటోన్న సుకుమార్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2020 | 2:26 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కరోనా లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్న సుకుమార్.. ఎలాంటి బ్రేక్‌లు‌ లేకుండా ‘పుష్ప’ను తెరకెక్కించాలనుకున్నారట. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మిగిలిన అన్ని పనులను ఆయన పూర్తిచేస్తున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సినిమా షూటింగ్‌ ప్రదేశాలను ఎంచుకోవడంతో పాటు ప్రధాన పాత్రాధారులపై కసరత్తులు చేస్తున్నారట. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారట లెక్కల మాస్టర్‌.

ఈ సినిమా షూటింగ్‌ మొత్తాన్ని భారత్‌లోనే పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారట. కరోనా ఎప్పుడు పోతుందన్న దానిపై శాస్త్రవేత్తలకు సైతం సరైన అవగాహన లేకపోవడంతో.. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. విదేశాలకు వెళ్లడం కంటే ఇక్కడే చిత్రీకరణ పూర్తి చేయడం మేలని ఆయన అనుకుంటున్నారట. అంటే మేడిన్ ఇండియా ప్రాజెక్ట్‌గా సుకుమార్ దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’‌ సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లా బ్రోజెక్‌ను సుకుమార్ ఎంచుకున్నారు. ఇప్పటికే పుష్పలోని కొన్ని సీన్లకు అతడు సినిమాటోగ్రఫీ కూడా అందించారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయనను భారత్‌కు తీసుకురావడం కష్టం. దీంతో ఇప్పుడు ఆయన స్థానంలో ఇక్కడివారినే తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. కాగా ప్రముఖ సినిమటోగ్రాఫర్‌ రత్నవేలు, సుకుమార్‌కు చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ఏడు చిత్రాల్లో నాలుగింటికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌ 2’కు పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను ఒప్పించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఒక సినిమాను పూర్తి చేసిన తరువాతే మరో సినిమాను ఒప్పుకుంటారు రత్నవేలు. ఇలాంటి క్రమంలో సుకుమార్ తన ఫ్రెండ్‌ను ఒప్పిస్తారా..? లేక వేరేవారిని తీసుకుంటారా..? అన్న విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఐదు భారతీయ భాషల్లో తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: హిందూ ఆలయంలో అఫ్రిదీ సేవా కార్యక్రమాలు.. ‘సాహో’ అంటున్న నెటిజన్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu