ఈసారి ‘మెగా’ మామా అల్లుళ్ల మల్టీస్టారర్‌.. కథ రెడీ!

ఈసారి 'మెగా' మామా అల్లుళ్ల మల్టీస్టారర్‌.. కథ రెడీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే, మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్‌ హీరోలు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 4:44 PM

Chiranjeevi- Sai Dharam tej Multi starrer: ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే, మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్‌ హీరోలు. ఈ నేపథ్యంలో త్వరలో మెగా మామా అల్లుళ్ల మల్టీస్టారర్‌ రాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలో కనిపించబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించి కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. బాబీ దర్వకత్వంలో తాను నటించబోతున్నట్లు చిరంజీవి ఆ మధ్యన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాబీ, చిరు కోసం ఓ కథను తయారు చేశారట. ఆ కథ చిరుకు వినిపించడం, ఆయనకు నచ్చేయడం జరిగిందట. ఇక ఈ కథలో మరో యంగ్ హీరో పాత్ర కూడా ఉండటంతో.. ఆ పాత్ర కోసం ధరమ్ తేజ్‌ని సూచించారట చిరు. ఇక ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ మల్టీస్టారర్‌ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా బాబీ ఇప్పటికే వెంకటేష్‌, నాగ చైతన్యలతో వెంకీ మామ అనే మల్టీస్టారర్‌ని తెరకెక్కించగా.. ఆ మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read This Story Also: దేశంలో కరోనా విజృంభణ.. 21 రోజుల్లోనే 10 లక్షల కేసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu