ఆ రికార్డు కేవలం చిరుకే సొంతం.. భవిష్యత్‌లోనూ మరో హీరోకు కష్టమేనా..!

చిరంజీవి.. ఈ పేరు వినగానే ఎన్నో అవార్డులు, రివార్డులే కాదు.. రికార్డులు కూడా గుర్తొస్తాయి. ఓ సాధారణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గానూ మెప్పించి.. ఆ తరువాత సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు చిరు. ఇక ఇటీవల సైరాతో తన డ్రీమ్‌ను కూడా ఆయన నెరవేర్చుకున్నారు. కాగా చిరు ఖాతాలో ఇప్పటికీ ఓ అరుదైన రికార్డు ఉంది. ఆ రికార్డును భవిష్యత్‌లోనూ మరో హీరో బ్రేక్ చేయడం చాలా కష్టమే. […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:32 pm, Sat, 26 October 19
ఆ రికార్డు కేవలం చిరుకే సొంతం.. భవిష్యత్‌లోనూ మరో హీరోకు కష్టమేనా..!

చిరంజీవి.. ఈ పేరు వినగానే ఎన్నో అవార్డులు, రివార్డులే కాదు.. రికార్డులు కూడా గుర్తొస్తాయి. ఓ సాధారణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గానూ మెప్పించి.. ఆ తరువాత సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు చిరు. ఇక ఇటీవల సైరాతో తన డ్రీమ్‌ను కూడా ఆయన నెరవేర్చుకున్నారు. కాగా చిరు ఖాతాలో ఇప్పటికీ ఓ అరుదైన రికార్డు ఉంది. ఆ రికార్డును భవిష్యత్‌లోనూ మరో హీరో బ్రేక్ చేయడం చాలా కష్టమే. ఇంతకు చిరు ఖాతాలో ఉన్న రికార్డు ఏంటో తెలుసా..!

ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో చిరునే. ఆ అక్కాచెల్లెళ్లు ఎవరంటే.. నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మాతో చిరంజీవి ‘ఘరానా మొగుడు’, ‘రిక్షావోడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’లో కలిసి నటించాడు. ఇక జ్యోతికతో ‘ఠాగూర్’ చిత్రంలో చిరు ఆడిపాడగా.. రోషిణితో ‘మాస్టర్’ చిత్రంలో రొమాన్స్ చేశాడు. ఇక మిగిలిన హీరోల విషయాలకొస్తే.. బాలయ్య, నగ్మాతో ‘అశ్వమేథం’.. ‘రోషిణి’తో ‘పవిత్ర ప్రేమ’లో కలిసి నటించాడు. కానీ జ్యోతికతో ఇంకా కలిసి నటించలేదు. అలాగే నాగార్జున, నగ్మాతో ‘వారసుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘కిల్లర్‌’లో.. జ్యోతికతో ‘మాస్’ చిత్రంలో ఆడిపాడాడు. కానీ రోషిణితో నటించలేదు. ఇక వెంకటేష్, నగ్మాతో ‘కొండపల్లి రాజా’, ‘సరదా బుల్లోడు’, ‘సూపర్ పోలీస్’ చిత్రాల్లో నటించగా.. జ్యోతిక, రోషిణిలతో ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఈ అక్కా చెల్లెళ్లలో జ్యోతిక మాత్రమే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. మిగిలిన ఇద్దరూ దూరంగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వారు రీ ఎంట్రీ ఇస్తే తప్ప.. భవిష్యత్‌లో చిరుకు ఉన్న ఈ రికార్డును మరో హీరో బ్రేక్ చేయడమే కష్టమే మరి.