చిరు మూవీలో చెర్రీనే ఫిక్స్..! హీరోయిన్లు వారేనా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాపై సస్పెన్స్‌లు ఇంకా వీడటం లేదు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట్లో రామ్‌ చరణ్‌ని అనుకున్నట్లు వార్తలు రాగా.. ఆ తరువాత మహేష్ బాబు లైన్‌లోకి వచ్చారు.

  • Tv9 Telugu
  • Publish Date - 10:47 am, Fri, 20 March 20
చిరు మూవీలో చెర్రీనే ఫిక్స్..! హీరోయిన్లు వారేనా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాపై సస్పెన్స్‌లు ఇంకా వీడటం లేదు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట్లో రామ్‌ చరణ్‌ని అనుకున్నట్లు వార్తలు రాగా.. ఆ తరువాత మహేష్ బాబు లైన్‌లోకి వచ్చారు. మెగాస్టార్‌తో కలిసి నటించేందుకు సూపర్‌స్టార్ చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో మహేష్‌కు, ఆచార్య టీమ్‌కు సరిపోలేదట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన ఔట్ అవ్వగా.. మళ్లీ చెర్రీనే ఫైనల్ చేశారట. ఈ క్రమంలో రాజమౌళిని ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా మొదట త్రిషను అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ మూవీ నుంచి ఆమె తప్పుకోవడంతో.. ఇప్పుడు ఆ పాత్ర కోసం కాజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చెర్రీ సరసన హీరోయిన్‌గా రష్మికను అనుకుంటున్నట్లు టాక్. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడగా.. ఈ లోపు హీరోయిన్లను ఫైనల్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఆ తరువాత శరవేగంగా ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇక సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read This Story Also: నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన ‘దిశ’ తండ్రి..!