Chaitanya In Samjam: సామ్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పిన చైతు.. అమ్మ గురించి ఏం చెప్పాడంటే..

Chaitanya In Samjam:సమంత హోస్ట్‌గా ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా సామ్‌జామ్ షో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇందులో భర్త అయిన నాగచైతన్యను

Chaitanya In Samjam: సామ్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పిన  చైతు.. అమ్మ గురించి ఏం చెప్పాడంటే..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 9:32 PM

Chaitanya In Samjam:సమంత హోస్ట్‌గా ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా సామ్‌జామ్ షో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇందులో భర్త అయిన నాగచైతన్యను ఇంటర్వూ చేస్తోంది ఈ అమ్మడు. పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఆటపట్టిస్తోంది. అయితే సమంత అడిగిన ఒక ప్రశ్నకు చైతన్య స్పందిస్తూ ఎమోషనల్‌గా సమాధానం చెప్పాడు. మీపై మహిళా ప్రభావం ఎంతమేరకు ఉందని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. జీవితంలో ఎలా మెలగాలో అమ్మ నాకు స్పష్టంగా చెప్పిందని, మనిషి ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌లా ఉండాలని, అటో, ఇటో ఏదో ఒక దారిని మాత్రమే ఎంచుకోవాలని సూచించిందని, తేల్చుకోలేని స్థితిలో మాత్రం ఉండకూడదని బదులిచ్చాడు. అలాగే సమంత మాట్లాడుతూ.. నాగచైతన్యతో పెళ్లైన తర్వాత తాను సినిమాలు మానేస్తున్నానంటూ రూమర్లు వచ్చాయని పేర్కొంది . దీనికి చైతన్య స్పందిస్తూ అసలు ఎందుకు సమాజంలోకి కొందరు వ్యక్తులు స్త్రీ, పురుషులు సమానం కాదని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నా దృష్టిలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అంటూ మాట్లాడారు. దీంతో చైతన్యను అందరు అభినందించారు. ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరి అనే చిత్రం చేస్తున్నారు. సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటున్న అందాల భామ.. పీరియాడిక్ ఫిల్మ్‌లో నటించడం వల్ల..

Akkineni Nagachaithanya: ఆ సినిమా కోసం సమంతకు నో చెప్పిన నాగచైతన్య.. ఏ మూవీ అంటే ?