‘డర్టీ హరీ’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు.. సినిమా పోస్టర్లు మహిళలను కించపరిచే విధంగా..

ఈ నెలలో విడుదల కావలసిన 'డర్టీ హరీ' సినిమా ప్రొడ్యూసర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

'డర్టీ హరీ' సినిమా నిర్మాతలపై కేసు నమోదు.. సినిమా పోస్టర్లు మహిళలను కించపరిచే విధంగా..
uppula Raju

|

Dec 15, 2020 | 5:26 AM

ఈ నెలలో విడుదల కావలసిన ‘డర్టీ హరీ’ సినిమా ప్రొడ్యూసర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మర్యాదను మంటగలిపే విధంగా సినిమా పోస్టర్లు ఉన్నాయని కొంతమంది స్త్రీలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లపై అతికించిన సినిమా పోస్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రముఖ దర్శకుడు ఎమ్. ఎస్. రాజు ‘డర్టీ హరీ’ సినిమాను డైరెక్ట్ చేశాడు. శ్రావణ్ రెడ్డి, రుహాని శర్మ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. మార్క్ కె రోజిన్ సంగీతం అందించారు. శివ రామకృష్ణ, సతీశ్ బాబు, సాయి పునీత్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఇప్పుడు వీరిపై కేసు ఫైల్ అయింది. డిసెంబర్ 18న ప్రైడే మూవీస్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పోస్టర్లు స్త్రీలను కించపరిచే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా నిలిచింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu