మాస్క్‌ మాటున దాగిన అందం.. ఒక్క సినిమాతోనే వేల హృదయాలు కొల్లగొట్టిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సినిమాలు చేస్తే కానీ పాపులారిటీ అంత సులభంగా సాధ్యం కాదు. కానీ కొందరు నటీమణులు మాత్రం ఒక్క సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్‌ను..

మాస్క్‌ మాటున దాగిన అందం.. ఒక్క సినిమాతోనే వేల హృదయాలు కొల్లగొట్టిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?
guess the actress
Follow us

|

Updated on: Feb 06, 2023 | 8:28 PM

సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సినిమాలు చేస్తే కానీ పాపులారిటీ అంత సులభంగా సాధ్యం కాదు. కానీ కొందరు నటీమణులు మాత్రం ఒక్క సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకుంటారు. పైన ఫొటోలో కనిపిస్తోన్న నటీమణి అలాంటి జాబితాలోకే వస్తుంది. ఇటీవల ఓ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఇంకా ఈ సినిమా విడుదలవ్వక ముందే ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఒకే ఒక్క పాటతో తెలుగు కుర్రకారు హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఇతంకీ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ 26 ఏళ్ల చిన్నది.. 2014లో బెంగళూరు మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ రన్నర్‌ అప్‌గా నిలిచింది. తాజాగా కళ్యాణ్‌ రామ్‌ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో ఒక క్లారిటీ వచ్చేసినట్లుంది. అవును మీరు అనుకుంటోంది నిజమే ఈ బ్యూటీ మరెవరో కాదు ఆషికా రంగనాథ్‌.

ఇవి కూడా చదవండి

చూడగానే తెలుగమ్మాయిలా కనిపించే ఈ అందాల తార అమిగోస్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ.. అనే పాటలో తళుక్కుమని కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా జరిగిన అమిగోస్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్ని్స్తోంది. మరి ఈ బ్యూటీ కెరీర్‌ను ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే అమిగోస్‌ విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..