Viral Photo: తలపై టోపీ.. చేతిలో కారు బొమ్మ.. ఈ బుడ్దోడు ఇప్పుడొక క్రేజీ టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా!

సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సెలబ్రిటీలకు.. ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా ఓ వారధిగా నిలుస్తోంది...

Viral Photo: తలపై టోపీ.. చేతిలో కారు బొమ్మ.. ఈ బుడ్దోడు ఇప్పుడొక క్రేజీ టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా!
Tollywood Hero
Follow us

|

Updated on: Aug 13, 2022 | 9:30 AM

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. విషెస్ నుంచి వివరాల వరకు అన్నింటికీ ఇంటర్నెటే మూలం. సెలబ్రిటీలకు.. ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా ఓ వారధిగా నిలుస్తోంది. తమకిష్టమైన హీరోహీరోయిన్లు నెట్టింట ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు.. వాటిని అభిమానులు భద్రంగా దాచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చైల్డ్‌హుడ్ ఫోటోలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సైడ్ క్యారెక్టర్లతో తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టి.. అనంతరం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’తో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకీ అతడెవరో మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. మరెవరో కాదు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth).

‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రతీ సినిమాకు ఎక్స్‌పెరిమెంట్స్ ట్రై చేస్తూ.. వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎదిగాడు. ప్రస్తుతం ‘కార్తికేయ 2’(Karthikeya 2) సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడగా.. ప్రతీ చోటా పాజిటివ్ రివ్యూస్ వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..