నీ వల్లే ప్రేమంటే ఏంటో తెలిసింది.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇవాళ ఆరవ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంట్లో అయాన్ పుట్టినరోజు వేడుకలను చేసిన బన్నీ.. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ ట్వీట్‌ను ఆయన పెట్టారు. ప్రేమంటే ఏమిటి అంటూ నేను చాలా సార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. గతంలో చాలా సార్లు బలమైన భావాలను చూసినప్పటికీ.. అది ప్రేమనో కాదో నాకు తెలీదు. […]

నీ వల్లే ప్రేమంటే ఏంటో తెలిసింది.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇవాళ ఆరవ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంట్లో అయాన్ పుట్టినరోజు వేడుకలను చేసిన బన్నీ.. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ ట్వీట్‌ను ఆయన పెట్టారు.

ప్రేమంటే ఏమిటి అంటూ నేను చాలా సార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. గతంలో చాలా సార్లు బలమైన భావాలను చూసినప్పటికీ.. అది ప్రేమనో కాదో నాకు తెలీదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. నువ్వు నా ప్రేమ. లవ్ యూ అయాన్‌ అని బన్నీ పోస్ట్ చేశారు. కాగా ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ దర్శకత్వంలో మూడోసారి నటించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక తొలిసారిగా జత కట్టబోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: పవన్- హరీష్‌ మూవీ ఎలా ఉండబోతుందంటే..!

Click on your DTH Provider to Add TV9 Telugu