వరుణ్ తేజ్ ‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్!

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్!

ఈ రోజుల్లో విష‌యం లేని సినిమాలైనా వ‌స్తున్నాయి కానీ వివాదం లేని సినిమాలు మాత్రం రావ‌డం లేదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా వాల్మీకి వివాదంలో ఇరుక్కుంది. దానికి కార‌ణం ‘వాల్మీకి’ టైటిల్లో గ‌న్ ఉండ‌ట‌మే. హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని త‌మిళ్ సినిమా జిగ‌ర్తాండ‌కు రీమేక్ గా తెర‌కెక్కించాడు. తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తమిళ హీరో అథర్వ, వరుణ్ తేజ్ యాక్ట్ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Aug 27, 2019 | 1:43 PM

ఈ రోజుల్లో విష‌యం లేని సినిమాలైనా వ‌స్తున్నాయి కానీ వివాదం లేని సినిమాలు మాత్రం రావ‌డం లేదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా వాల్మీకి వివాదంలో ఇరుక్కుంది. దానికి కార‌ణం ‘వాల్మీకి’ టైటిల్లో గ‌న్ ఉండ‌ట‌మే. హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని త‌మిళ్ సినిమా జిగ‌ర్తాండ‌కు రీమేక్ గా తెర‌కెక్కించాడు. తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తమిళ హీరో అథర్వ, వరుణ్ తేజ్ యాక్ట్ చేసాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ వాల్మీకి బోయలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తమ హక్కులకు భంగపరిచే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన చిత్ర యూనిట్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వాల్మీకి బోయ హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది.మరి ‘వాల్మీకి’ టైటిల్‌పై హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’.. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu