ఆ సినిమా ఆపేయండి: బోనీకపూర్
దివంగత తార శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ సినిమా టైటిల్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ సినిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆసినిమా ఏదో కాదు.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన `శ్రీదేవి బంగ్లా`. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్లో హీరోయిన్ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లుగా చూపించారు. దీంతో ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా […]
దివంగత తార శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ సినిమా టైటిల్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ సినిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆసినిమా ఏదో కాదు.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన `శ్రీదేవి బంగ్లా`. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్లో హీరోయిన్ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లుగా చూపించారు. దీంతో ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ‘శ్రీదేవి బంగ్లా’ దర్శక నిర్మాతలకు బోనీకపూర్ నోటీసులు పంపారు. కానీ వారి నుండి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తదుపరి చర్యగా ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాను ఆపేయాలని కోరుతూ బోనీకపూర్ కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.