Yo Yo Honey Singh: మా మామ కూడా నాతో అలా చేశాడు.. హనీసింగ్ భార్య సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ లో హనీసింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తన భర్త లాంగికంగా వేసిస్తున్నడని ఆరోపించింది.

Yo Yo Honey Singh: మా మామ కూడా నాతో అలా చేశాడు.. హనీసింగ్ భార్య సంచలన వ్యాఖ్యలు..
Shalini Talwar
Follow us

|

Updated on: Aug 05, 2021 | 9:52 PM

Yo Yo Honey Singh: బాలీవుడ్‌‌‌‌లో హనీసింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌‌‌గా మారిన విషయం తెలిసిందే. తన భర్త లాంగికంగా వేసిస్తున్నడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. హనీసింగ్ పై  గృహహింస లైంగిక వేధింపులు ఆర్థిక మోసం మానసిక హింస ఆరోపణలు చేస్తూ తన పిటీషన్‌‌‌లో పేర్కొంది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం’ కింద మంగళవారం పిటీషన్ దాఖలు చేసింది. తన భర్త అతని కుటుంబం చేతిలో అనేక శారీరక, మానసిక హింసలకు గురైనట్లు సింగ్ భార్య షాలినీ తల్వార్ అన్నారు. ఆమె గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద రూ. 10 కోట్ల పరిహారం కోరింది. 38 ఏళ్ల తల్వార్, గత కొన్ని సంవత్సరాలుగా సింగ్ తనను చాలాసార్లు కొట్టాడని, అతను అతని కుటుంబం తనను శారీరకంగా హింసించారని పేర్కొంది. హానీసింగ్ అసలు పేరు హిర్దేశ్ సింగ్. అహిర్దేశ్ సింగ్- తల్వార్ జనవరి 23, 2011 న వివాహం చేసుకున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా అతడు తనను ఎలా శారీరకంగా హింసించాడని పిటిషన్‌లో తల్వార్ పేర్కొంది.

అంతే కాదు తన భర్తకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అలాగే తమ పెళ్లి ఉంగరాన్ని కూడా అతడు పెట్టుకోలేదని, పెళ్లి ఫోటోలను ఎక్కడా ఆన్ లైన్‌‌‌లో కూడా పెట్టలేదని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన మామ కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని… ఒక సారి తాను బట్టలు మార్చుకుంటుంటే హానీ సింగ్ తండ్రి పీకలవరకు తాగి తన గదిలోకి వచ్చాడని, అసభ్యకరంగా తన వంటి పై చేతులువేశాడని ఆమె ఆరోపించింది. అయితే హనీసింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అతడి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంతవరకు స్పందించలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Big Boss 5: బిగ్‌బాస్‌ 5 మరో అప్‌డేట్.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనుంది ఆ యూట్యూబ్‌ స్టారేనా?

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !

Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. ‘పుష్ప’ షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..