సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు.. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా వరుణ్ ధావన్​ వివాహం

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ఏడాది చాలామంది సినీతారలు పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే.. టాలీవుడ్ హీరోలు రానా, నిఖిల్, నితిన్ హీరోయిన్ లు కాజల్, నిహారికల వివాహాలు జరిగాయి

  • Sanjay Kasula
  • Publish Date - 8:59 am, Mon, 25 January 21
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు.. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా వరుణ్ ధావన్​ వివాహం

Varun Dhawan Wedding : సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ఏడాది చాలామంది సినీతారలు పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే.. టాలీవుడ్ హీరోలు రానా, నిఖిల్, నితిన్ హీరోయిన్ లు కాజల్, నిహారికల వివాహాలు జరిగాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది.

అలీబాగ్​లోని మాన్సస్ హౌస్ రిసార్ట్​లో జరిగిన ఈ వేడుకలో ప్రేయసి నటాషా దలాల్​కు మూడు ముళ్లు వేశారు. ఇరుకుటుంబాలతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నారు వరుణ్. వీరి పెళ్లి గతేడాది మేలోనే జరగాల్సింది కానీ కొవిడ్ ప్రభావం వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కొద్దిమంది సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్​ సెలబ్రిటీలు ఎవరినీ పిలవలేదు.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)