Sunny Leone : కొవిడ్ సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం ఇబ్బందిపడుతోందని శృంగార తార, నటి సన్నిలియోన్ అన్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన రోజువారి కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముంబైలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో స్పాట్ బాయ్స్, లైట్ బాయ్స్, చాలామంది రోజువారి కార్మికులు ఆర్థికంగా బాగా చితికిపోయారని తెలిపారు. కొంతమంది నటీనటులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నా రోజువారీ వేతన కార్మికులకు ఇది సాధ్యంకాదని పేర్కొన్నారు.
పని చేస్తేనే ఇళ్లు గడుస్తుంది కనుక వారి పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. వారి జీవనోపాధి షూటింగుల పనిపై ఆధారపడి ఉంటుందని చలించిపోయారు. వీరు చిత్ర పరిశ్రమకు చాలా అవసరం. ఈ పరిస్థితులలో వారికి కాస్త సాయం చేయాలని, తోడుగా ఉండాలని సూచించింది. తాను కూడా తోచినంత సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. భారతీయ మూలాలు కలిగిన ఈ కెనడా పోర్న్ స్టార్ శృంగార సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ తరువాత ఆమె పాపులారిటీ ఇండియాలో పీక్స్ కి చేరింది.
అనేకమార్లు గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీ గా నిలిచారు సన్నీలియోన్. స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కన పెట్టి ఆమె నామస్మరణే భారతీయ యువత చేస్తున్నట్లు దీని ద్వారా అర్థం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా సెటిలైన తరువాత ఆమె క్రేజ్ పీక్స్ కి చేరింది. అలాగే కోట్ల సంపాదనతో తోటి స్టార్స్ ఈర్ష్య పడేలా ఎదిగింది. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ 2012లో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. అడల్ట్ కంటెంట్ మూవీ జిస్మ్ 2 మూవీతో ఆమె బాలీవుడ్ తెరపై మొదటిసారి కనిపించారు. జిస్మ్ 2 ఊహించని విజయం సాధించిన నేపథ్యంలో సన్నీఆ తరహా పాత్రలకు ఫేమస్ అయ్యారు.