బాలీవుడ్‌లో మరోసారి పేలిన ‘మీటూ’ బాంబు..ఆ దర్శక నిర్మాతపై షెర్లిన్‌ చోప్రా సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌లో మరోసారి పేలిన 'మీటూ' బాంబు..ఆ దర్శక నిర్మాతపై షెర్లిన్‌ చోప్రా సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌లో మరోసారి మీటూ బాంబు పేలింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక నిర్మాత గురించి మరో నటి సీరియస్ అలిగేషన్స్ చేశారు.

Ram Naramaneni

|

Jan 21, 2021 | 12:44 PM

బాలీవుడ్‌లో మరోసారి మీటూ బాంబు పేలింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక నిర్మాత గురించి మరో నటి సీరియస్ అలిగేషన్స్ చేశారు. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న మీటూ ఉద్యమాన్ని మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు షెర్లిన్‌ చోప్రా.

2005లో తనకు జరిగిన అనుభవాన్ని బయటపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో బాంబు పేల్చారు షెర్లీన్‌ చోప్రా. ఓ సినిమా డిస్కషన్ సమయంలో సాజిద్‌ ఖాన్‌ తనతో మిస్‌ బిహేవ్ చేశారని చెప్పారు. ఈ మధ్య జియా ఖాన్‌ సిస్టర్‌ కూడా సాజిద్ మీద ఇలాంటి ఆరోపణలే చేశారు.

2018లోనూ సాజిద్‌ మీద మీటూ ఆరోపణలు వచ్చాయి. ఆ టైంలో మీటూ మూమెంట్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండటంతో గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఏకంగా సెట్స్ మీద ఉన్న హౌస్‌ఫుల్‌ 4 సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచే సాజిద్‌ను తప్పించేశారు మేకర్స్‌. అంతేకాదు ఫిలిం అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్ అసోషియేషన్‌ నుంచి వన్‌ ఇయర్‌ సస్పెండ్ కూడా చేశారు. మరి లెటేస్ట్ అలిగేషన్స్ తరువాత ఇంకెన్నీ చర్యలు తీసుకుంటారో చూడాలి.

Also Read:

Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu