Sara Ali Khan Birthday: మాయ చేసిన సారా.. బొద్దుగా ఉండే హీరోయిన్.. సన్నజాజిలా ఎలా మారిందో తెలుసా.

చిన్నప్పటి నుంచి ఎంతో బొద్దుగా ఉండే ఈ అమ్మడు.. పెద్దయ్యాక కూడా చాలా లావుగా ఉండేది. నటనపై ఉన్న ఆసక్తితో తన బరువు తగ్గేందుకు విదేశాలకు వెళ్లింది

Sara Ali Khan Birthday: మాయ చేసిన సారా.. బొద్దుగా ఉండే హీరోయిన్.. సన్నజాజిలా ఎలా మారిందో తెలుసా.
Sara Alikhan
Follow us

|

Updated on: Aug 12, 2022 | 12:10 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్‏కు (Sara Ali Khan) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు దక్షిణాదిలోనూ అభిమానులు ఉన్నారు. ఆగస్ట్ 12న సారా పుట్టినరోజు 2018లో కేదార్ నాథ్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన సారా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఓవైపు హిట్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు సారా చాలా బొద్దుగా ఉండేది అని మీకు తెలుసా.

చిన్నప్పటి నుంచి ఎంతో బొద్దుగా ఉండే ఈ అమ్మడు.. పెద్దయ్యాక కూడా చాలా లావుగా ఉండేది. నటనపై ఉన్న ఆసక్తితో తన బరువు తగ్గేందుకు విదేశాలకు వెళ్లింది. అయితే తన బరువు గురించి ఫాలోవర్లతో చెప్పేందుకు సారా ఎప్పుడూ సిగ్గుపడేది కాదు. గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. నేను నాలుగు సంవత్సరాలు కొలంబియాకు వెళ్లాను. రెండవ సంవత్సరం చివరలో నటిగా మారాలనుకున్నాను. ఆ సమయంలో నేను 96 కిలోలు ఉన్నాను. దీంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటున్న సమయంలో బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

సారా తన ప్రీ వెయిట్ లాస్ ఫేజ్ నుంచి త్రోబ్యాక్ ఫోటోష్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. బరువు తగ్గిన తర్వాత తన ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. తన జిమ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు సారా అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఉన్న సారా… ప్రస్తుతానికి చాలా వ్యత్సాసం ఉంది. మీరు చూడండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.