105 నుంచి 65 కిలోలకు తగ్గిన కొరియోగ్రాఫర్ భార్య..! ఫొటో చూసి షాక్ అవుతున్న జనాలు

Remo Dsouzas Wife Lizelle: బరువు తగ్గడం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రముఖ

105 నుంచి 65 కిలోలకు తగ్గిన కొరియోగ్రాఫర్ భార్య..! ఫొటో చూసి షాక్ అవుతున్న జనాలు
Remo D Souza And Lizelle
Follow us

|

Updated on: Sep 21, 2021 | 4:14 PM

Remo Dsouzas Wife Lizelle: బరువు తగ్గడం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా భార్య ఒక్కసారిగా40 కిలోలు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది. లిజెల్లె డిసౌజా ‘ఫ్యాట్ టు ఫిట్’ పేరిట 105 కిలోల నుంచి 65 కిలోలకు తగ్గింది. ఆమెకు సంబంధించిన రెండు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. లిజెల్ బరువు ఇంతకు ముందు105 కిలోలు. ఇప్పుడు 65 కిలోలు. అయితే బరువు తగ్గడానికి ఆమె ఎటువంటి శస్త్రచికిత్సను ఆశ్రయించలేదు. లిజెల్ ఈ పద్దతుల ద్వారా తన బరువును తగ్గించుకుంది.

ఉపవాసం లిజెల్ బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపవాసాన్ని పాటించింది. 15 గంటల పాటు ఏమి తినకుండా ఉండేది. క్రమంగా ఉపవాస సమయాన్ని 16 గంటలకు పెంచింది. పిండి పదార్థాలకు దూరంగా ఉంది. ఇలా చేయడం వల్ల కొన్నిరోజులకు 15-20 కిలోల బరువు తగ్గింది.

20 గంటల ఉపవాసం 15 నుంచి 20 కిలోలు తగ్గిన తర్వాత లిజెల్ మరింత స్ఫూర్తి పొందింది. ఏకంగా ఉపవాస సమయాన్ని 18 నుంచి 20 గంటలకు పెంచింది. ఈ సమయంలో ఆమె రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తినేది. అది కూడా ఇంట్లో తయారుచేసింది మాత్రమే తినేది. రోజువారీ వ్యాయామాలు, సాయంత్రం వాకింగ్‌ ఎక్కువగా చేసేది. మధ్యమధ్యలో ఒకరోజు తనకు ఇష్టమైన చాట్, పానీపూరి, సింధీ కధీ, కీటో ఐస్ క్రీమ్, కీటో పిజ్జా తినేది.

ప్రశంసలు కురిపించిన రెమో బరువు తగ్గడానికి లిజెల్ చాలా కష్టపడింది. ఆమె ప్రయత్నాన్ని భర్త రెమో డిసౌజా ప్రశంసించారు. ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ స్థితికి చేరుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారు. మీకు ఆ సంకల్ప శక్తి ఉంది. థ్యాంక్స్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీరు నాకంటే బలంగా ఉన్నారు’ అని రాశాడు.

Bank New Rules: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న నిబంధనలు

Minister Harish Rao: రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..

Jr College Admissions: సెప్టెంబరు 22 నుండి TTD జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు