Narasimha: ‘నరసింహ’లో నీలాంబరి క్యారెక్టర్‌కు ఫస్ట్ ఛాయిస్ రమ్యకృష్ణ కాదా? మరెవరు?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ‘నరసింహ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్లలో ఒకరైన రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన విలన్ పాత్రల్లో ఒకటిగా పేర్కొంటారు ..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ‘నరసింహ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్లలో ఒకరైన రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన విలన్ పాత్రల్లో ఒకటిగా పేర్కొంటారు.
రమ్యకృష్ణ ఆ పాత్రకు ప్రాణం పోసింది. అయితే, ఈ ఐకానిక్ పాత్ర కోసం దర్శకుడు కె.ఎస్. రవికుమార్ మొదట బాలీవుడ్ నుంచి ఒక గ్లోబల్ స్టార్‌ను అనుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో కాదు అందాల తార ఐశ్వర్య రాయ్!
ఎందుకు తప్పుకుంది?
రమ్యకృష్ణ అద్భుతంగా పోషించిన నీలాంబరి పాత్ర కోసం దర్శకనిర్మాతలు మొదట ఐశ్వర్య రాయ్‌ని సంప్రదించారట. ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్‌లో అగ్ర స్థానంలో ఉన్నారు. ఆమె గ్లామర్, గ్రేస్, అంతర్జాతీయ గుర్తింపు ఈ పాత్రకు సరిపోతాయని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఐశ్వర్య రాయ్ ఆ పాత్ర స్వభావం కారణంగానే ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
‘నీలాంబరి’ అనేది నెగటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్న, అహంకారం, పట్టుదల నిండిన పాత్ర. అప్పుడు ఐశ్వర్య రాయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నందున, అలాంటి నెగటివ్ పాత్ర చేయడం కంటే పాజిటివ్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

Aishwarya And Ramya
ఐశ్వర్య రాయ్ తప్పుకోవడంతో, ఆ పాత్ర రమ్యకృష్ణ వద్దకు వచ్చింది. రమ్యకృష్ణ నటనతో ఆ పాత్ర స్థాయి మారిపోయింది. ఆమె గ్లామర్, కోపం, రాజసం, రజనీకాంత్‌తో పోటీ పడే ధైర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి, నీలాంబరి పాత్రను చిరస్మరణీయం చేసింది.
ఆ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ఐశ్వర్య రాయ్ ‘నరసింహ’లో నటించి ఉంటే ఎలా ఉండేదో ఊహించడం కష్టమే. కానీ, ఆమె రిజెక్ట్ చేయడం వల్లే తెలుగు, తమిళ ప్రేక్షకులకు రమ్యకృష్ణ రూపంలో ఒక ఐకానిక్ విలన్ పాత్ర దక్కిందనడంలో సందేహం లేదు.




