Mumbai Cruise Drugs Case: నేడు మళ్లీ ఎన్‌సీబీ ముందుకు అనన్య.. క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో విచారణ..

Ananya Panday: బాలీవుడ్‌లో ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ.. మరింత దూకుడు పెంచింది. నిన్న బాలీవుడ్‌ నటి అనన్య పాండేను రెండు గంటల పాటు విచారించిన ఎన్సీబీ అధికారులు..

Mumbai Cruise Drugs Case: నేడు మళ్లీ ఎన్‌సీబీ ముందుకు అనన్య.. క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో విచారణ..
Ananya

బాలీవుడ్‌లో ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ.. మరింత దూకుడు పెంచింది. నిన్న బాలీవుడ్‌ నటి అనన్య పాండేను రెండు గంటల పాటు విచారించిన ఎన్సీబీ అధికారులు.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. 11గంటలకు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానున్నారు అనన్య పాండే. ఆర్యన్‌ మీకు ఎలా పరిచయం ? మీరు డ్రగ్స్‌ తీసుకుంటారా ? ఆర్యన్‌తో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నారా ? ఆర్యన్‌కు ఎప్పటినుంచి డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంది ? డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేసేవారు..? అన్న అంశాలపై ప్రశ్నలు సంధించిన అధికారులు..ఇవాళ మరింత లోతుగా విచారించే అవకాశముంది.

నిన్న అనన్యతో పాటు షారుఖ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు..అనన్య, ఆర్యన్‌ మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలనాటి హీరో చుంకీ పాండే కూతురైన అనన్య..షారూఖ్ తనయుడు ఆర్యన్ కు క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆర్యన్‌తో అనన్య డ్రగ్స్‌పై వాట్సాప్‌ చాట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఓ యువనటితో ఆర్యన్.. డ్రగ్స్‌ గురించి వాట్పాప్ లో చాటింగ్ చేసినట్టు ముంబై కోర్టుకు ఆధారాలు సమర్పించారు ఎన్సీబీ అధికారులు.

అయితే.. అనన్యను విచారించడంతో ఆర్యన్‌తో డ్రగ్స్‌పై వాట్సాప్‌లో చాటింగ్‌ చేసింది అన్యన్యా పాండే అని తేలిపోయింది. మరోవైపు ముంబై కోర్టు ఆర్యన్‌ కస్టడీని ఈనెల 30వరకు పొడిగించగా..ముంబై హైకోర్టులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26న జరగనుంది.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi Speech: ఈ ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ..

Huzurabad By-Election: బహిరంగ సభ కాదు.. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రోడ్‌షో.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు

 

Click on your DTH Provider to Add TV9 Telugu