వయసు 50.. 30 లుక్..! ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా వయస్సు పెరిగినా సరే, యవ్వనంగా, ఫిట్‌గా కనిపిస్తూ కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. ఆమె ఫిట్‌నెస్, అందం వెనుక జిమ్ వర్కౌట్లు, క్రమశిక్షణతో కూడిన యోగా ఉన్నప్పటికీ, ఆమె ఆరోగ్యం, అందానికి ప్రధాన కారణం డిటాక్స్ డ్రింక్స్ ..

బాలీవుడ్ నటి మలైకా అరోరా వయస్సు పెరిగినా సరే, యవ్వనంగా, ఫిట్‌గా కనిపిస్తూ కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. ఆమె ఫిట్‌నెస్, అందం వెనుక జిమ్ వర్కౌట్లు, క్రమశిక్షణతో కూడిన యోగా ఉన్నప్పటికీ, ఆమె ఆరోగ్యం, అందానికి ప్రధాన కారణం డిటాక్స్ డ్రింక్స్!
శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేసే ఈ ప్రత్యేక పానీయాలు ఆమె రోజువారీ రొటీన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. మలైకా అరోరా సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే లేదా రోజులో వివిధ సమయాల్లో తన జీవక్రియను వేగవంతం చేయడానికి, శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి రకరకాల పానీయాలను తీసుకుంటారు. మలైకా అరోరా ఫిట్‌నెస్, బ్యూటీ వెనుక ఉన్న ఆ అద్భుతమైన డిటాక్స్ డ్రింక్స్ ఏమిటో తెలుసుకుందాం.
నిమ్మకాయ, తేనె, గోరువెచ్చని నీరు
ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేసే అత్యంత ప్రాథమికమైన, ప్రభావవంతమైన డిటాక్స్ పానీయం. ఉదయం పరగడుపున దీనిని తీసుకోవడం వల్ల రాత్రి విశ్రాంతి తర్వాత జీర్ణ వ్యవస్థను చురుకుగా మారుస్తుంది. నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు కాలేయం పనితీరును మెరుగుపరచి, వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మెంతి నీరు
మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం ఆయుర్వేదంలో అనాదిగా ఉంది. మెంతులు జీర్ణ వ్యవస్థకు చాలా మంచివి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాక, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది, దీనివల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్
మలైకా తన ఫిట్‌నెస్ రొటీన్‌లో ACV ను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, జీవక్రియ రేటును పెంచుతుంది. అంతేకాదు, గట్ హెల్త్‌ను సమతుల్యం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీలకర్ర-ధనియాల నీరు
జీలకర్ర, ధనియాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని వేడిని సమతుల్యం చేసి, టాక్సిన్స్‌ను తొలగించడానికి తోడ్పడతాయి. ఈ పానీయం చర్మ సమస్యలను తగ్గించి, సహజమైన కాంతిని ఇస్తుంది.
మలైకా అరోరా నిరూపించినట్లుగా, అందం అనేది కేవలం బయటి నుంచి రాదు. క్రమశిక్షణతో కూడిన ఈ డిటాక్స్ పానీయాలు ఆమె శరీరాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. మీరు కూడా మీ రోజువారీ ఆహారంలో ఈ సహజసిద్ధమైన డ్రింక్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఆమెలాగే ఫిట్‌గా, యవ్వనంగా ఉండవచ్చు.




