Sitaramam: సీతారామం సినిమాపై కంగనా రనౌత్ రివ్యూ.. మృణాల్ ఠాకూర్ పై ఆసక్తికర కామెంట్స్..

తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సైతం సీతారామం సినిమాకు రివ్యూ ఇచ్చేసింది. అంతేకాకుండా హీరోయిన్ మృణాల్ నటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Sitaramam: సీతారామం సినిమాపై కంగనా రనౌత్ రివ్యూ.. మృణాల్ ఠాకూర్ పై ఆసక్తికర కామెంట్స్..
Sitaramma
Follow us

|

Updated on: Sep 21, 2022 | 8:00 PM

మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం ()Sitaramam. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకావ్యం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దొచుకుంది. ఇందులో రష్మిక మందన్నా, సుమంత్ అక్కినేని, తరుణ్ భాస్కర్, భూమిక కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సైతం సీతారామం సినిమాకు రివ్యూ ఇచ్చేసింది. అంతేకాకుండా హీరోయిన్ మృణాల్ నటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సీతారామం సినిమా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అసాధారణం. ముఖ్యంగా సీతామహాలక్ష్మీ.. ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో మృణాల్ నటన అద్భుతం. మరెవరు ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది కంగనా. “ఎట్టకేలకు సీతారామం సినిమా చూసేందుకు నాకు సమయం దొరికింది. ఈమూవీ నాకు అద్భుతమైన అనుభూతి కలిగింది. ఈ ఎపిక్ లవ్ స్టోరీ అసాధారణమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం. డైరెక్టర్ హనురాఘవపూడికి శుభాకాంక్షలు. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు.

ఇవి కూడా చదవండి
Kangana

Kangana

ముఖ్యంగా మృణాల్ నిజమైన రాణి. ఆమె నటనలో అరుదైన గౌరవం ఉంది. మరెవరో ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు ” అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించగా.. సీతామహాలక్ష్మీగా మృణాల్ నటించింది.