Salman Khan: అప్పటినుంచే సల్మాన్‌ను హతమార్చాలని ప్రయత్నిస్తున్నాం.. అలా తప్పించుకున్నాడు.. తన మాస్టర్ ప్లాన్‌ గుట్టు విప్పిన గ్యాంగ్‌స్టర్..

బిష్ణోయ్‌ గ్యాంగ్ టాపిక్ బాలీవుడ్లో మరోసారి సంచలనంగా మారింది. సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) గురించి తాజాగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) చెప్పిన మాటలు బీ టౌన్‌ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala)ను..

Salman Khan: అప్పటినుంచే సల్మాన్‌ను హతమార్చాలని ప్రయత్నిస్తున్నాం.. అలా తప్పించుకున్నాడు.. తన మాస్టర్ ప్లాన్‌ గుట్టు విప్పిన గ్యాంగ్‌స్టర్..
Salman Khan
Follow us

|

Updated on: Jul 15, 2022 | 5:30 PM

బిష్ణోయ్‌ గ్యాంగ్ టాపిక్ బాలీవుడ్లో మరోసారి సంచలనంగా మారింది. సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) గురించి తాజాగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) చెప్పిన మాటలు బీ టౌన్‌ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala)ను హతమార్చి అందర్నీ షాక్‌కు గురిచేసిన ఈ గ్యాంగ్‌స్టర్ తాజాగా సల్మాన్‌ ఖాన్‌ను పలుసార్లు చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యామని చెప్పడం..బీ టౌన్‌ను స్టన్ అయ్యేలా చేసింది. సల్లూ భాయ్‌ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. కాగా సింగర్ సిద్దూ మూసేవాలను చంపేసిన మరుసటి రోజు సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేస్తామని బహిరంగ లేఖ రాసింది బిష్ణోయ్‌ గ్యాంగ్. ఆ తరువాత సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కు కూడా అలాంటి బెదిరింపు లేఖే రాసి ఈ స్టార్ కుంటుంబాన్ని బెంబేలెత్తించింది. ఇది జరిగిన కొన్ని రోజులకు సల్మాన్ ఖాన్ లాయర్ కు కూడా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు ఎలాంటి ప్రణాళికలు వేశాడో చెప్పి అందరినీ ఉలిక్కి పడేలా చేశాడీ గ్యాంగ్‌స్టర్‌.

సల్మాన్‌ను విడిచిపెట్టం.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లోని సంపత్ నెహ్రాను సల్మాన్‌ను చంపడానికి ముంబాయికి పంపించామని చెప్పాడు లారెన్స్. అందుకోసం 4 లక్షల విలువ చేసే ప్రత్యేక రైఫిల్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు కూడా..! అయితే అదే సంవత్సరంలో సంపత్ నెహ్రాను పోలీసులు అరెస్టు చేయడంతో.. సల్మాన్‌ తప్పించుకున్నాడన్నాడు లారెన్స్. అయితే బిష్ణోయ్‌ గ్యాంగ్ సల్మాన్‌ ఖాన్‌ పై చంపేంతగా పగ పెంచుకోవడానికి కారణం.. సల్లూభాయ్‌ జింకలను వేటాడడమే. ‘హమ్ సాత్ సాత్ హే’ సినిమా షూటింగ్ సందర్భంగా.. జోధ్‌పూర్ కన్హ విలేజ్‌కు వెళ్లిన ఈ కండల వీరుడు షూటింగ్‌ గ్యాప్‌లో జింకలను వేటాడాడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో కోర్టు వరకు వెళ్లి నిర్దోషిగా బయటికి వచ్చారు. అయితే జింకలను దైవంగా ఆరాధించే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మాత్రం సల్మాన్‌ ఖాన్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదంటోంది. ఈక్రమంలోనే లారెన్స్ బిష్ణోయ్‌ నేరుగా రంగంలోకి దిగి సల్మాన్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..