Ranu Mondal: క్షణంలో వెయ్యోవంతు చాలు ఓ మనిషి జీవితం మారిపోవడానికి. అదృష్ట. దురదృష్టాల మధ్య ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అదృష్టం కలిసి వచ్చి.. రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయినవారు ఎందరో.. అయితే అలా సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నవారిలో .. పాత జీవితాన్ని మరచిపోకుండా మరింత కష్టపడి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారు ఉన్నారు. గత జీవితం మరచిపోయి.. కష్టపడకుండా వచ్చిన ఫేమ్ తో తలపొగరు చూపించిన వారు ఉన్నారు.. అలాంటి అదృష్టంతో ఫేమస్ అయ్యి.. ప్రవర్తనతో దురదృష్టం తెచ్చుకున్న వ్యక్తి రణు మండల్.
పశ్చిమ బెంగాల్లో రైల్వే స్టేషన్ లో పాడిన ఒక్క పాటతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీ అయ్యింది. రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసుకునే రణు మండల్ ఒకే ఒక్క వీడియో తో దేశవ్యాప్తంగా అందరికీ ఆకట్టుకుంది. అప్పట్లో తన గాత్రంతో మంచి అవకాశాలను కూడా అందుకుంది. బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టినట్టే వచ్చాయి. పేరుకు పేరు డబ్బుకు డబ్బు అన్నీ వచ్చాయి. అయితే అప్పట్లో బాగా పాపులర్ అయిన రణు మండల్ ఆర్ధిక పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా కూడ తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో మూడు పాటలు పాడించారు. హిమేష్తో కలిసి ఆమె పాడిన ‘తేరీ మేరీ తేరి మేరి కహానీ’ పాట ఒక ఊపు ఊపింది. కానీ ఆ తర్వాత ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు వచ్చినసమయంలో రణు మండల్ ప్రవర్తన పై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఎవరైతే మట్టిలో మాణిక్యమంటూ కీర్తించి.. నెత్తిన పెట్టుకున్నవారే ఆమెను తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బు, స్థాయి రాగానే గర్వం తలకెక్కిందని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు, అయితే ప్రస్తుతం కరోనా అన్ని పరిశ్రమలపై ప్రభావం చూపినట్లే.. సినీ రంగంపై కూడా చూపించి. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీనే అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం బాలీవుడ్లో ఎలాంటి సింగింగ్ అవకాశాలు రావడం లేదు. బయోపిక్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కేదాఖలా లేదు.. అంతే కాకుండా ఆమె ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. రణు మండల్ పాపులారిటీ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఒక బిచ్చగత్తెను సోషల్ మీడియా ద్వారా ఫేమస్ చేసిన నెటిజన్లు.. ఈమె ను ఆదుకోవడానికి రెడీ గా లేనట్లు తెలుస్తోంది.
Also Read: పర్యాటకులతో కళకళాడే నెక్లెస్ రోడ్.. ఆకట్టుకుంటోన్న వేస్ట్ బాటిల్ నమూనా డస్ట్ బిన్..