Shilpa Shetty: మరోసారి సాగర కన్యగా మారిన శిల్పా శెట్టి.. 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అదే లావణ్యం..

Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు తెలియని ఇండియన్‌ మూవీ లవర్‌ ఉండరనడంలో పెద్దగా అతిశయోక్తి ఉండదేమో. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ..

Shilpa Shetty: మరోసారి సాగర కన్యగా మారిన శిల్పా శెట్టి.. 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అదే లావణ్యం..
Shilpa Shetty
Follow us

|

Updated on: Oct 09, 2021 | 7:02 PM

Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు తెలియని ఇండియన్‌ మూవీ లవర్‌ ఉండరనడంలో పెద్దగా అతిశయోక్తి ఉండదేమో. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. ఒకప్పుడు కుర్రకారును తన అందంతో ఆకట్టుకున్న శిల్పా.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్‌ చేస్తోంది. ఇటీవల భర్త రాజ్‌ కుంద్రా పోర్న్‌ వీడియోల కేసులో మరోసారి శిల్పా పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అయితే తన భర్త చేస్తోన్న పనులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన శిల్పా తన కెరీర్‌ పనిలో తాను బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా తన వృత్తిపరమైన అంశాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

ఇందులో భాగంగానే శిల్పా శెట్టి తాజాగా ఓ అందమైన ఫోటోను షేర్‌ చేసింది. సాగర కన్య గెటప్‌లో ముస్తాబై అభిమానులను మరోసారి సర్‌ప్రైజ్‌ చేసింది. 1996లో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహస వీరుడు, సాగర కన్య’ సినిమాలో శిల్పా శెట్టి సాగర కన్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో శిల్పా శెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు శిల్పాను ఈ సినిమానే దగ్గర చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన 25 ఏళ్ల తర్వాత శిల్పా ఇప్పుడు మళ్లీ అదే రూపంలో దర్శనమిచ్చింది. ఇన్నేళ్లు గడుస్తోన్న శిల్పా అందం ఏమాత్రం తగ్గలేదని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సూపర్‌ డ్యాన్స్‌ చాప్టర్‌ 4 అనే రియాలిటీ షో పాల్గొన్న శిల్పా శెట్టి ఇలా సాగర కన్య గెటప్‌లో స్టెప్పులేసి అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం శిల్పాశెట్టి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: MAA Elections 2021: మా అధ్యక్ష పదవి కోసం మోనార్క్ vs మంచు.. ఇద్దరి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసా?

US Nuclear Submarine: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం..

Huzurabad By-Election: హుజూరాబాద్ బైపోల్స్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ.. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు