Bipasha Basu: 43 ఏళ్ల వయసులో తల్లికానున్న హీరోయిన్‌! ఫ్యాన్స్‌ నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌

Bipasha Basu- Karan Singh Grover: జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కల్లోలం రేపింది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాసాబసు (Bipasha Basu). హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ..

Bipasha Basu: 43 ఏళ్ల వయసులో తల్లికానున్న హీరోయిన్‌! ఫ్యాన్స్‌ నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌
Bipasha Basu
Follow us

|

Updated on: Jul 29, 2022 | 6:56 PM

Bipasha Basu- Karan Singh Grover: జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కల్లోలం రేపింది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాసాబసు (Bipasha Basu). హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ. కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ఎలోన్‌ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌ (Karan Singh Grover)తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. కాగా వీరి ఆరేళ్ల వైవాహిక దాంపత్య బంధానికి గుర్తుగా వీరి జీవితంలోకి మరొకరు అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిపాసా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మినస్తుందన్న వార్త బాలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ జంటకు ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ విషయంపై అటు బిపాసా కానీ, కరణ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

కాగా పెళ్లైన తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న బిపాసా 2020లో డేంజరస్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ లో ఆమె భర్త కరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించాడు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ తో టచ్‌లో ఉంటోందీ సొగసరి. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటుంది. అదేవిధంగా తన భర్తతో వెకేషన్‌, టూర్ల ఫొటోలను ఫ్యాన్స్‌ తో పంచుకుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..