Mrunal Thakur: నేను హీరోయిన్ అని తెలియగానే నా భాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..

బుల్లితెరపై ఎన్నో సీరియల్లలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ తర్వాత సూపర్ 30 అనే సినిమాతో వెండితెరపై

Mrunal Thakur: నేను హీరోయిన్ అని తెలియగానే నా భాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..
Mrunal
Follow us

|

Updated on: Feb 13, 2022 | 6:20 PM

బుల్లితెరపై ఎన్నో సీరియల్లలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆ తర్వాత సూపర్ 30 అనే సినిమాతో వెండితెరపై హీరోయిన్‏గా కనిపించి సూపర్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే హీరోయిన్‏గా సక్సెస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ జెర్సీ సినిమాలో నటిస్తోంది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రానికి హిందీ రిమేక్ ఇది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

మృణాల్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నానని తెలిపింది. అలాగే తనకు ఏడు నెలల క్రితం తన బ్రేకప్ జరిగిందని.. తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని తెలిపింది. పద్దతులు.. కట్టుబాట్లను ఎక్కువగా ఫాలో అవుతాడని.. తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పింది. అయితే తాను నటినని.. సినిమాల్లో నటిస్తానని తెలిసిన తర్వాత తనను విడిచిపెట్టి పారిపోయినట్లు చెప్పుకొచ్చింది. తనను విడిచి వెళ్లిపోయిన అతనిపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇప్పుడు సర్దిచెప్పుకుని పెళ్లి చేసుకున్న ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్పవని తెలిపింది. తమకు పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత.. వారిని పెంచే క్రమంలో గొడవలు రావొచ్చని.. అందుకే తన బ్రేకప్ గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని తెలిపింది. అలాగే తన కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

Also Read: Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..

Viral Video: పుష్ప క్రేజ్ అస్సలు తగ్గడం లేదుగా.. రష్మిక.. అల్లు అర్జున్ డైలాగ్ ఎలా చెప్పారో మీరే చూడండి..

Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..

Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?.. 

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?