Besharam Song: ‘బేషరమ్ రంగ్’ సాంగ్ దుమారం.. శక్తీమాన్ నటుడు సంచలన వ్యాఖ్యలు..

డిసెంబర్ 12న ఈ మూవీ నుంచి బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో దీపికా ధరించిన దుస్తులు.. కొన్ని సీన్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈపాటలో అశ్లీలత ఎక్కువైందని.. అసభ్యకమరైన సీన్స్ ఉన్నాయని..

Besharam Song: 'బేషరమ్ రంగ్' సాంగ్ దుమారం.. శక్తీమాన్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
Mukesh Khanna
Follow us

|

Updated on: Dec 17, 2022 | 4:25 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు బైకాట్ ట్రెండ్ ఉక్కిరిబిక్కిరి చేయగా..ఇప్పుడు బేషరమ్ రంగ్ సాంగ్ వివాదం నడుస్తోంది. బీటౌన్ బాద్ షారుఖ్ ఖాన్.. దీపికా పదుకొణె జంటగా నటించిన పఠాన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 12న ఈ మూవీ నుంచి బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో దీపికా ధరించిన దుస్తులు.. కొన్ని సీన్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈపాటలో అశ్లీలత ఎక్కువైందని.. అసభ్యకమరైన సీన్స్ ఉన్నాయని.. వాటిని మార్చకపోతే సినిమాను నిషేదిస్తామంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు సైతం దీపికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోల్ కతా వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న షారుఖ్ ఈ వివాదం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కారణంగానే నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతుందని.. అదే మనుషుల మధ్య విభేదాలను సృష్టించి నాశనం చేస్తుందని అన్నారు. తాజాగా ఈ సాంగ్ వివాదంపై శక్తిమాన్ నటుడు.. ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ పాటపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాంగ్ చూసేందుకు చాలా అసభ్యకరంగా ఉందని.. ఇతరుల ఫీలింగ్స్ ను రెచ్చగొచ్చేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ పోర్ట్ ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు.

ముకేష్ ఖన్నా మాట్లాడుతూ.. ” బాలీవుడ్ సినీ పరిశ్రమ గాడి తప్పింది. అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తులు… నటీనటుల్ని చూపించిన ఫిల్మ్ మేకర్స్.. భవిష్యత్తులో వాళ్లను నగ్నంగా చూపించే ఆస్కారం ఉంది. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశమేమీ స్పెయిన్, స్వీడన్ కాదు. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డ్ పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు ? ” అంటూ ఆయన ఆగ్రాహం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ముందు నుంచి బైకాట్ సెగ తగులుతుండగా.. తాజాగా విడుదలైన బేషరమ్ సాంగ్..వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇందులో దీపికా ధరించిన దుస్తులు.. ఆమె కనిపించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?