Bigg Boss 5 Telugu: సన్నీ.. బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎలా కొట్టాడో తెలుసా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్‌ విన్నర్‌..

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగిసింది. 100 రోజులకుపైగా జరిగిన ఈ సీజన్ ఎన్నో రకాల..

Bigg Boss 5 Telugu: సన్నీ.. బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎలా కొట్టాడో తెలుసా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్‌ విన్నర్‌..
Biggboss Winner Sunny
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:46 PM

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ఎట్టకేలకు ముగిసింది. 100 రోజులకుపైగా జరిగిన ఈ సీజన్ ఎన్నో రకాల ఎమోషన్స్‌ను సాక్ష్యంగా నిలిచింది. 19 మంది కంటెస్టెంట్‌ల మధ్య జరిగిన గిల్లికజ్జాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇలా సీజన్‌ కొంచెం, ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సాగింది. అయితే ప్రేక్షకులకు మాత్రం అన్నిరకాల ఎమోషన్స్‌ను పంచారు. ఇక అందరి ఊహలను తలకిందులు చేస్తూ సన్నీ బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎగిరేసుకుపోయిన విషయం తెలిసిందే. మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఏకంగా టైటిల్‌ను కొట్టిన తీరును అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక సన్నీ ప్రస్తుతం తన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చిన సన్నీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన విజయానికి ఎలాంటి స్ట్రాటజీ వాడలేదని చెప్పిన సన్నీ, కేవలం తన ఆట తాను ఆడుకుంటూ వెళ్లిపోయానన్నాడు. మొదట్లో అరవడం లాంటి తప్పులు చేశాను, కానీ నాగార్జున ఆ విషయాన్ని హెచ్చరించిన తర్వాత పూర్తిగా మారిపోయానని తెలిపాడు. ‘గెలవడానికి ఏదైనా చేద్దామనుకోలేదు, కేవలం నా ట్రాక్‌లో నేను వెళ్లాను. టాస్క్‌ వచ్చినప్పుడు టాస్క్‌ ఆడాను, పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్ర పోషించాను, తర్వాత నాలా నేనున్నాను’ అని చెప్పుకొచ్చాడు. సన్నీ చెప్పిన మిగతా విశేషాలను పూర్తి ఇంటర్వ్యూలో చూడండి..

Also Read: Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..

IND vs SA: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందించిన సల్మాన్ బట్.. ఎందుకంటే..

Tamannaah: బర్త్‌డే బ్యూటీ తమన్నా చిన్ననాటి ఫోటోలు.. విత్‌ క్యూట్‌నెస్‌ ఓవర్‌ లోడెడ్‌..