నాగార్జునకు బిగ్‌బాస్ ఛాలెంజ్

కింగ్ నాగార్జునకు నిజమైన పరీక్ష మొదలవుతోంది. 60ఏళ్ల ఈ సీనియర్ నటుడు ఎన్నో విజయాలను చూశారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై మొదటిసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది ఆయనకు బిగ్ ఛాలెంజ్. నాగార్జున బుల్లితెరకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఆయన చాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఆదివారం నుంచి అదరగొట్టనున్నారు. ఆయనకు నిజంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:15 am, Sun, 21 July 19
నాగార్జునకు బిగ్‌బాస్  ఛాలెంజ్

కింగ్ నాగార్జునకు నిజమైన పరీక్ష మొదలవుతోంది. 60ఏళ్ల ఈ సీనియర్ నటుడు ఎన్నో విజయాలను చూశారు. ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై మొదటిసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది ఆయనకు బిగ్ ఛాలెంజ్. నాగార్జున బుల్లితెరకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఆయన చాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఆదివారం నుంచి అదరగొట్టనున్నారు. ఆయనకు నిజంగా ఇదొక సవాలే.. ఎందుకంటే గతంలో వేరే స్టార్స్ స్ధానంలో ఆయన ఈసారి నిలవబోతున్నారు. వాళ్లకు.. నాగ్‌కు ఎంత కంపారిజన్ ఉందో ప్రేక్షకులు కూడా అంచనా వేస్తారు. అందుకే ఇదొక పెద్ద సవాల్.

బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. తెలుగునాట ఈ షో ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇంతగా కావడానికి ఎన్టీఆర్ కారణమంటే కాదనలేని సత్యం. ఆ తర్వాత రెండో సీజన్ నాని నడిపించాడు. అటు ఎన్టీఆర్, ఇటు నానీ. ఈ ఇద్దరూ నడిపిన షోను ఇప్పుడ నాగ్ అందిపుచ్చుకున్నారు. సో నాచురల్‌గా వారిద్దరితో నాగ్‌ను కంపేర్ చేస్తారు.

ఈ ఆదివారం రాత్రి నుంచి ప్రసారం కాబోతున్న బిగ్‌బాస్ త్రీ షో చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నా అవన్నీ పక్కకు నెట్టి స్టార్ట్ కాబోతుంది. దీంతో అందరి చూపులు ఈ సీజన్‌పైనే పడ్డాయి. ఈ షో పై అంచనాలు కూడా అంతే రేంజ్‌లో ఉన్నాయి. మరి నాగార్జున వీరి అంచనాల్ని అందుకుంటారా? లేదా ?అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.