నాన్న మరణంతో మానసికంగా కుంగిపోయా.. కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డా.. ప్రముఖ నటి మనసులో మాట..

Actor Raai Lakshmi: తన తండ్రి మరణంతో మానసికంగా ఎంతో వేదన అనుభవించానని చెబుతోంది ప్రముఖ నటి రాయ్‌లక్ష్మి. కరోనా నుంచి కోలుకున్న ఆమె గత

  • uppula Raju
  • Publish Date - 5:10 am, Thu, 28 January 21
నాన్న మరణంతో మానసికంగా కుంగిపోయా.. కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డా.. ప్రముఖ నటి మనసులో మాట..

Actor Raai Lakshmi: తన తండ్రి మరణంతో మానసికంగా ఎంతో వేదన అనుభవించానని చెబుతోంది ప్రముఖ నటి రాయ్‌లక్ష్మి. కరోనా నుంచి కోలుకున్న ఆమె గత సంవత్సర అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. నోటి క్యాన్సర్‌ వల్ల గతేడాది తన తండ్రి కన్నుమూశారని, తర్వాత తన జీవితం ఎంతో వెలితిగా అనిపించిందని తెలిపింది. మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫర్‌ వచ్చిందని చెప్పింది. దీంతో తాను ఎంతో సంతోషంతో దుబాయ్‌కు వెళ్లానని కానీ తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బాధపడ్డానని తెలిపింది. దుబాయ్‌లో తనకు అంతగా ఎవరూ తెలీదని, ఒక్కదాన్నే ఓ రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొంది. కరోనా లక్షణాలు తనలో ఎక్కువగా కనిపించేసరికి మానసికంగా మరింత కుంగిపోయానని వెల్లడించింది. ప్రతి నాలుగు రోజులకొకసారి పరీక్షలు చేయించుకున్నానని, 12 రోజుల తర్వాత నెగెటివ్‌గా తేలిందని తన పర్సనల్ ఫీలింగ్స్‌ని బయటపెట్టింది రాయ్‌లక్ష్మి. స్వీయ నిర్బంధంలో ఉండడం ఎంతో కష్టమని అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పింది.

Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..