అందుకే హీరోయిన్‌ను మార్చారట!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Nov 11, 2020 | 8:29 PM

వరుస డిజాస్టర్ల తరువాత బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు

అందుకే హీరోయిన్‌ను మార్చారట!

BB3 Movie Update: వరుస డిజాస్టర్ల తరువాత బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్‌ హిట్‌ కావటంతో వీరిద్దరి కలియికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు హీరోయిన్ విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

చాలా మంది పేర్లు వినిపించిన తరువాత మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను చిత్రయూనిట్ ఫైనల్‌ చేశారు‌. కొద్ది రోజుల్లోనే ఆమె కూడా సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. టెస్ట్ షూట్‌లో బాలయ్య సరసన మరీ చిన్నపిల్లలా కనిపిస్తుందనే ఆమెను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించినట్టుగా వార్తలు వినిపించాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

అయితే ఈ వార్తలపై బీబీ 3 టీం క్లారిటీ ఇచ్చింది. ప్రయాగ మార్టిన్ లుక్ సెట్ అవ్వని కారణంగా మార్చలేదని వెల్లడించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ప్రయాగనే తప్పుకున్నారని తెలిపారు. తాజాగా ఆమె స్థానంలో మరో యంగ్ బ్యూటీ సయేషాను ఫైనల్ చేశారు చిత్రయూనిట్. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu