మా ఇద్దరి మధ్య గొడవ అలాంటిదే.. హరీష్‌పై బండ్ల వ్యాఖ్యలు

ఆ మధ్యన దర్శకుడు హరీష్ శంకర్‌, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మే నెలలో గబ్బర్‌ సింగ్‌ 8ఏళ్లు అయిన సందర్భంగా ట్వీట్ వేసిన హరీష్ శంకర్‌., అందులో నిర్మాత బండ్ల గణేష్‌ పేరును మరిచారు.

మా ఇద్దరి మధ్య గొడవ అలాంటిదే.. హరీష్‌పై బండ్ల వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 2:40 PM

ఆ మధ్యన దర్శకుడు హరీష్ శంకర్‌, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మే నెలలో గబ్బర్‌ సింగ్‌ 8ఏళ్లు అయిన సందర్భంగా ట్వీట్ వేసిన హరీష్ శంకర్‌., అందులో నిర్మాత బండ్ల గణేష్‌ పేరును మరిచారు. తరువాతి ట్వీట్‌లో బండ్ల పేరును ప్రస్తావించారు. అయితే అప్పటికే అలిగిన ఈ నిర్మాత ఓ టీవీ ఇంటర్వ్యూలో హరీష్‌పై విరుచుకుపడ్డారు. హరీష్ రీమేక్‌లతోనే హిట్లు కొడతాడని, ‘ఒక్క స్ట్రైట్‌ సినిమా తీసి హిట్ కొట్టమనండి. నేను ఇండస్ట్రీని వదిలి వెళతాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీష్‌ సైతం సోషల్ మీడియా వేదికగా బండ్లపై కామెంట్లు చేశారు. ఇదంతా గడిచి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. అయితే ఇప్పుడు వీరిద్దరు యూటర్న్ తీసుకున్నారు.

అన్నాదమ్ములన్న తరువాత గొడవలు ఉంటాయని, మేమిద్దరం అలాంటి వాళ్లమేనని బండ్ గణేష్ అన్నారు. అతడి లాంటి పెద్ద దర్శకులతో తనకు ఎందుకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్‌లో అతడితో తాను సినిమాలు ఎందుకు తీయనని ఈ నిర్మాత ప్రశ్నించారు. మన భార్యలతో చిన్న చిన్న గొడవలు సాధారణంగా ఉంటాయని, హరీష్‌తో తన గొడవను అంత సీరియస్‌గా తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక ఈ వీడియోపై స్పందించిన హరీష్ శంకర్‌.. నాకు బండ్ల గణేష్‌పై చాలా గౌరవం ఉందని, గబ్బర్‌ సింగ్‌ ముందే కాదు, మిరపకాయ్‌ ముందు కూడా ఆయన తనతో సినిమా తీయాలనుకున్నారని, కరోనా నుంచి అతడు కోలుకున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగినట్లైంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..