Unstoppable Season 2 : రెట్టింపు ఉత్సహంతో అన్ స్టాపబుల్ సీజన్ 2.. విజయవాడ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నటసింహం నందమూరి బాలకృష్ణ  అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ  ఆహా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలయ్య.

Unstoppable Season 2 : రెట్టింపు ఉత్సహంతో అన్ స్టాపబుల్ సీజన్ 2.. విజయవాడ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్
Unstoppable Season 2
Follow us

|

Updated on: Oct 02, 2022 | 12:48 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ  అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ  ఆహా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. తన మాటలతో గెస్ట్ లను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరించారు బాలయ్య. వంద శాతం తెలుగు ఎంటర్టైన్మెంట్‌తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్యని అభిమానులకి చూపించింది. ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అయ్యారు బాలయ్య. అందు కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జతకటింది ఆహ.

జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం దర్శకత్వం అన్ స్టాపబుల్ సీసన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఎవరూ చూడనంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు.

ఇక అన్ స్టాపబుల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను విజయవాడలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలోని అనామోల్ గార్డెన్స్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ వేడుకకు బాలయ్య అభిమానులు భారీగా తరలి రానున్నారు. అలాగే అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నాను, అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందుని ఆశిస్తున్నాను” అన్నారు ప్రశాంత్ వర్మ.

ఇవి కూడా చదవండి
Balakrishna

Balakrishna

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!