మోక్షఙ్ఞ బాధ్యతలు తీసుకున్న జక్కన్న.. కానీ..!

నందమూరి వారసుడు మోక్షఙ్ఞ వెండితెర ఎంట్రీపై బాలయ్య ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మోక్షఙ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని, అతడి గ్రాండ్‌ ఎంట్రీ కోసం తాను కొన్ని స్క్రిప్ట్‌లను ఫైనల్ చేశానని బాలయ్య స్పష్టం చేశారు. దీంతో మోక్షఙ్ఞను ఎవరు పరిచయం చేయబోతున్నారన్న ఆతృత నందమూరి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ క్రమంలో ఫిలింనగర్‌లో పలువురు స్టార్ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం మోక్షఙ్ఞ ఎంట్రీ బాధ్యతలను దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

మోక్షఙ్ఞ బాధ్యతలు తీసుకున్న జక్కన్న.. కానీ..!
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 4:11 PM

నందమూరి వారసుడు మోక్షఙ్ఞ వెండితెర ఎంట్రీపై బాలయ్య ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మోక్షఙ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని, అతడి గ్రాండ్‌ ఎంట్రీ కోసం తాను కొన్ని స్క్రిప్ట్‌లను ఫైనల్ చేశానని బాలయ్య స్పష్టం చేశారు. దీంతో మోక్షఙ్ఞను ఎవరు పరిచయం చేయబోతున్నారన్న ఆతృత నందమూరి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ క్రమంలో ఫిలింనగర్‌లో పలువురు స్టార్ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం మోక్షఙ్ఞ ఎంట్రీ బాధ్యతలను దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ మోక్షఙ్ఞను జక్కన్న డెరెక్ట్ చేయరట. ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నందమూరి వారసుడి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఆ సినిమా జక్కన్న దర్శకత్వ పర్యవేక్షణలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు టాక్. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై మోక్షఙ్ఞ మొదటి చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలుసుకోవాలనుకుంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read This Story Also: కరోనాపై యుద్ధం.. రేపు ఏపీలోని ఆలయాల్లో హోమాలు, యాగాలు