‘నిశ్శబ్దం’ అనుష్క దగ్గరికి అలా వెళ్లిందట.. రివీల్ చేసిన దర్శకుడు

అనుష్క నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దంలో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. గాంధీ జయంతి సందర్భంగా

  • Tv9 Telugu
  • Publish Date - 5:06 pm, Fri, 25 September 20
'నిశ్శబ్దం' అనుష్క దగ్గరికి అలా వెళ్లిందట.. రివీల్ చేసిన దర్శకుడు

Ansuhka Nishabdham: అనుష్క నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దంలో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీని చూసిన సెన్సార్ టీమ్‌.. నిశ్శబ్దం థియేటర్‌లో విడుదల కావాల్సిన మూవీ అంటూ కితాబిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు మొదటి ఛాయిస్ అనుష్క కాదట. తాప్సీని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు హేమంత్ మధుకర్‌ ఈ కథను రాశారట. ఈ విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ”నాకు తాప్సీ చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆమెను, మాధవన్‌ని దృష్టిలో పెట్టుకొని నిశ్శబ్దంను రాశా. పలు సందర్భాల్లో కథను కూడా వినిపించా.  అయితే స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి అయ్యాక కోన వెంకట్‌, అనుష్కను కలిసి కథను వినిపించారు. ఆమెకు కథ చాలా నచ్చడంతో.. చివరకు అనుష్క ఫైనల్ అయ్యింది” అని చెప్పుకొచ్చారు.

కాగా ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవుడు ఉన్న ఆర్టిస్ట్‌గా కనిపించనుంది. మాధవన్ పెయింటర్‌గా నటించారు. శాలిని, అనుష్క, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో విడుదల కానుండగా.. మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ అవ్వనుంది.

Read More:

గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు.. అనుష్క ఘాటు సమాధానం

మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!