ఆనందంలో అమలాపాల్.. ఎగురుతూ గంతులేస్తున్న ఫొటోలు వైరల్..

ఆమె చిత్రంలో నగ్నంగా నటించి అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చిన కేరళ కుట్టి అమలాపాల్ కాంట్రవర్సీకి పెట్టింది పేరు.

  • Publish Date - 3:34 pm, Sun, 22 November 20
ఆనందంలో అమలాపాల్.. ఎగురుతూ గంతులేస్తున్న ఫొటోలు వైరల్..

ఆమె చిత్రంలో నగ్నంగా నటించి అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చిన కేరళ కుట్టి అమలాపాల్ కాంట్రవర్సీకి పెట్టింది పేరు. తన పర్సనల్ లైఫ్‌నకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఈ అమ్మడు ఇప్పుడు దిల్ కుషీగా ఉంది. పొట్టి డ్రెస్‌లతో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఎంజాయ్ చేస్తోంది.

తెలుగు, మళయాల, కన్నడ, తమిళ సినిమాలతో అమలాపాల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల వివాదాలకు దూరంగా ఉంటూ పలు సినిమాలపై దృష్టి సారించింది. సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ పాలోవర్లను ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ అమ్మడు. కొద్దిగా నవ్వండి లేదా పెద్దగా నవ్వండి.. ఎవరు జడ్జి చేస్తారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను షేర్ చేసింది. గ్రీన్ టాప్ అండ్ టోర్న్ జీన్స్‌లో ఎగురుతూ సంబరంగా గంతులేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అంతులేని ఈ ఆనందానికి కారణాలు ఏంటో మాత్రం చెప్పలేదు ఈ భామ. అమలాపాల్ ప్రస్తుతం హిందీలో సక్సెస్ సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు రిమేక్‌లో నటిస్తోంది.