బన్నీకి అంత రెమ్యునరేషనా?

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’ .ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, ఆ రెండూ యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాకి గానూ ఒక అనఫిషియల్ వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషకం కింద 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఓ వార్త నెట్టింట […]

బన్నీకి అంత రెమ్యునరేషనా?

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’ .ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, ఆ రెండూ యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాకి గానూ ఒక అనఫిషియల్ వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషకం కింద 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అల్లూ అరవింద్ కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా ఉన్నారు.. అయినప్పటికీ అల్లు అర్జున్ 25 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడట. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా థియట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్లకు, హిందీ డబ్బింగ్ హక్కులు 19.5 కోట్లకు అమ్ముడయ్యాయి.
హీరో, డైరెక్టర్లకి ముట్టజెప్పిన కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ల తో ‘అల వైకుంఠపురంలో’ సినిమా బడ్జెట్ 120 కోట్ల దాకా అయినట్టు సమాచారం.. మొత్తానికి ఓ పెద్ద హీరో, ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో గనక మూవీ ప్లాన్ చేస్తే ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిందే అన్న వార్త ఇప్పుడు హాటెస్ట్ గాసిప్ గా మారింది..