ఓకే చెప్పిన ‘ఎఫ్‌ 2’ భామలు.. మరి హీరోల మాటేంటి!

వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఓకే చెప్పిన 'ఎఫ్‌ 2' భామలు.. మరి హీరోల మాటేంటి!
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2020 | 7:10 PM

F2 sequel movie: వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ని తెరకెక్కిస్తానంటూ అప్పుడే ప్రకటించిన అనిల్ రావిపూడి, ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ దర్శకుడి తదుపరి చిత్రం ఇంకా ఏ హీరోతో కన్ఫర్మ్ అవ్వకపోగా.. తాజా సమాచారం ప్రకారం ఎఫ్‌ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎఫ్‌ 2లో నటించిన వారినే సీక్వెల్‌లో తీసుకోవాలనుకుంటోన్న అనిల్‌.. ఆ స్క్రిప్ట్‌ని పూర్తి చేసి హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లకు వినిపించారట. వారిద్దరికి ఈ స్క్రిప్ట్‌ బాగా నచ్చిందట. ఇక ఇప్పుడు ఆ స్ట్రిప్ట్‌ను హీరోలకు వినిపించే పనిలో ఉన్నారట. వారిద్దరు ఓకే చెప్పి, డేట్లు ఇచ్చేస్తే.. త్వరలోనే ఎఫ్ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు అనిల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్ 2‌ని నిర్మించిన దిల్ రాజునే ఈ సీక్వెల్‌కి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

Read More:

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu