‘మంగళ్‌యాన్‌’… ఆకాశంలో ఓ అద్భుతం!

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశమని టీజర్ బట్టి తెలుస్తోంది. ప్రముఖ సెలెబ్రిటీస్ అందరూ కూడా ఈ టీజర్‌ను […]

  • Ravi Kiran
  • Publish Date - 4:28 pm, Tue, 9 July 19
'మంగళ్‌యాన్‌'... ఆకాశంలో ఓ అద్భుతం!

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశమని టీజర్ బట్టి తెలుస్తోంది.

ప్రముఖ సెలెబ్రిటీస్ అందరూ కూడా ఈ టీజర్‌ను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అందరిని ఆకట్టుకున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి జగన్ శక్తి దర్శకుడు.