Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై మరోసారి స్పందించిన నాగార్జున.. ఈసారి ఏమన్నారంటే..

గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు ఎట్టకేలకు మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సినిమా పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా అంటూ ఏపీ సీఎం

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై మరోసారి స్పందించిన నాగార్జున.. ఈసారి ఏమన్నారంటే..
Nagarjuna
Follow us

|

Updated on: Jan 15, 2022 | 1:31 PM

గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు ఎట్టకేలకు మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సినిమా పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా అంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. టికెట్‌ ధరలు, థియేటర్ల మూసివేత, తదితర ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కరించడంల భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చిరంజీవి క‌ల‌వ‌డంపై కొంత దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఓవైపు ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున చిరు సంప్ర‌దింపుల‌పై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూంటే మ‌రోవైపు వైసీపీ నుంచి నుంచి చిరుకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిని మెగాస్టార్‌ ఖండించారు.

కాగా ఇదివరకే జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున స్పందించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరి కోసమే చిరంజీవి.. జగన్‌తో సమావేశం అవుతున్నారని, బంగార్రాజు సినిమా రిలీజ్ ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని చెప్పారు. తాజాగా ఇదే బంగార్రాజు ఫంక్షన్‌లో మరోసారి ఈ విషయంపై స్పందించారు నాగార్జున. చిరంజీవి వెళ్లారు కాబట్టి తప్పకుండా సినీ ఇండస్ట్రీ సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్నారు. టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత తదితర సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత కొద్దిరోజులుగా ప్రభత్వానికి, పరిశ్రమ వర్గాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇరువురి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి . ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్​ను కలిసి సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు.

Also Read: Sankrathi 2022: గోదావరి జిల్లాలో సంక్రాంతికి పందుల కుస్తీ పోటీలు.. తిలకించేందుకు తరలి వచ్చిన జనం

Makar Sankranti 2022: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..

Hyderabad: బంజారాహిల్స్ లో అమానుషం.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రి..