Akhil Akkineni : షూటింగ్ కు సిద్దమవుతున్న సురెందర్ రెడ్డి – అఖిల్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి
ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది.
Akhil Akkineni : ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. అటు ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమా నిర్మించనున్నారు.
ఫిబ్రవరి నెలలో సురెందర్ రెడ్డి – అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభం చేసి.. మార్చి రెండోవారం నుంచి షూటింగ్ రెగ్యులర్ గా కంటిన్యూ చేసే ప్లాన్ లో ఉన్నారట సురేందర్ రెడ్డి టీమ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నాడట దర్శకుడు సురెందర్ రెడ్డి. ఇక అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారంలో మోస్ట్ ఎలిజిబుల్ మూవీ విడుదల కాబోతుండగా.. ఈ నెలాఖరున అఖిల్ బ్యాచిలర్ సినిమాను ఫినిష్ చేసి సురేందర్ రెడ్డి సినిమా పై ఫోకస్ చేయనున్నాడట అఖిల్.
మరిన్ని ఇక్కడ చదవండి :
క్రేజీ కాంబినేషన్ నుంచి అప్డేట్.. కేజీఎఫ్ హీరోతో కలిసి భారీ చారిత్రాత్మక సినిమా తీయనున్న శంకర్ ?